Chiranjeevi: అతను మన మనిషి కాదు.. బాలకృష్ణ మనిషి అన్నారు..

ABN , Publish Date - Feb 10 , 2025 | 12:16 AM

‘‘విశ్వక్‌సేన్‌ సినిమా వేడుకకు వెళ్తున్నారా?’ అని కొందరు నన్ను అడిగితే ఎందుకు వెళ్లకూడదు అని ప్రశ్నించా. ‘అతడు మన మనిషి కాదు బాలకృష్ణ మనిషి. అప్పుడప్పుడు తారక్‌ అంటుంటాడు’ అని అన్నారు.

‘‘విశ్వక్‌సేన్‌ (Vishwak sen) సినిమా వేడుకకు వెళ్తున్నారా?’ అని కొందరు నన్ను అడిగితే ఎందుకు వెళ్లకూడదు అని ప్రశ్నించా. ‘అతడు మన మనిషి కాదు బాలకృష్ణ మనిషి(Bala Krishna). అప్పుడప్పుడు తారక్‌ (Tarak) అంటుంటాడు’ అని అన్నారు. వేరే వారిపై అభిమానం ఉండకూడదా? ప్రేమ ఉండకూడదా? అని అడిగా’’ అని చిరంజీవి (Chiranjeevi) అన్నారు. విశ్వక్‌సేన్‌ హీరోగా రామ్‌ నారాయణ దర్శకత్వం వహించిన చిత్రం లైలా’. సాహు గారపాటి నిర్మాత. ఈ నెల 14న విడుదల కానుందీ సినిమా.







ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడుతూ "మా అబ్బాయి రామ్‌చరణ్‌కు సూర్య అంటే ఇష్టం. అందుకని నేను వాడి సినిమా ఫంక్షన్స్‌కు వెళ్లకూడదా? కలిసి భోజనం చేయకూడదా? ఇటీవల ఆ కాంపౌండ్‌.. ఈ కాంపౌండ్‌ అంటూ ప్రెస్‌మీట్‌లో ఎదురైన ప్రశ్నకు.. ‘మా ఇంటికి కాంపౌండ్‌ ఉందిగానీ ఫిల్మ్‌ ఇండస్ర్టీకి లేదు’ అని విశ్వక్‌ చక్కగా సమాధానం ఇచ్చాడు. నెల్లూరులో మా కజిన్స్‌ ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ల గురించి మాటలు అనుకుంటూ కొట్టుకునేవారు. హీరోలు మేమంతా బాగానే ఉంటాం. అభిమానులే కొట్టుకుంటారు. నేను ఇండస్ట్రీలోకి వచ్చాక హీరోల మద్య స్నేహం ఉండాలని కోరుకున్నా. నేను, నాగార్జున, వెంకటేశ్‌, బాలకృష్ణ కలిసి కట్టుగా ఉంటాం. ఒకరి ఈవెంట్స్‌కు మరొకరం వెళ్తుంటాం. తరచూ కలుసుకుంటూ ఉంటాం. విశ్వక్‌.. మన ఇండస్ర్టీలో ఒకడు, మన కుటుంబ సభ్యుడు అని అనుకోవాలి. మా ఇంటి హీరోలంతా కలిసి మెలిసి ఉంటారు. అంతమాత్రాన మా ఇమేజ్‌లు ఏమైనా తక్కువా? ఇప్పుడు ప్రదర్శితమైన ప్రత్యేక వీడియోలో పవన్‌ కల్యాణ్‌ పేరు వినిపించగానే మీరంతా కేరింతలు కొట్టారు. అందుకు నేను గర్వపడుతున్నా. ‘పుష్ప 2’ చిత్రం పెద్ద హిట్‌ అయింది. దానికి గర్విస్తున్నా. ఇండస్ర్టీలో ఏదైనా సినిమా విజయవంతంగా ఆడిదంటే ప్రతి ఒక్కరూ హర్షించాలి. ఎందుకంటే ఒక్క సినిమా వెనుక ఎంతో మంది కష్టం ఉంటుంది. నిర్మాతలకు లాభం వస్తే మళ్లీ సినిమాలు తీయడానికే ఆ డబ్బు పెడుతుంటారు’’ అని అన్నారు.  

Updated Date - Feb 10 , 2025 | 12:16 AM