Chinmayi Sripada: ఇన్స్టా చుక్కలకు ఇచ్చి పడేసిన చిన్మయి..
ABN , Publish Date - Jan 29 , 2025 | 02:51 PM
Chinmayi Sripada: మోడ్రన్ జెన్ జీ తెలుగు భాషలో వారిని ఇన్స్టా చుక్కలని పిలుస్తుంటారు. ఈ చుక్కలు బేసికల్ గా సమాజోద్ధరక మెసేజ్ లు ఇస్తున్నామనుకుంటు పనికిమాలిన చెత్తను యువత బుర్రలోకి ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తుంటారు.
సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఆడవాళ్లుకు ప్రవచనాలు చెబుతూ కొందరు సూడో ఇన్‌స్టాగ్రామ్ సెలబ్రిటీలు తెగ కనిపిస్తున్నారు. వాస్తవానికి వారిని ఇన్స్టా సెలబ్రిటీలు అని పిలవరు. మోడ్రన్ జెన్ జీ(Gen Z) తెలుగు భాషలో వారిని ఇన్స్టా చుక్కలని పిలుస్తుంటారు. ఈ చుక్కలు బేసికల్ గా సమాజోద్ధరక మెసేజ్ లు ఇస్తున్నామనుకుంటు పనికిమాలిన చెత్తను యువత బుర్రలోకి ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. ఇంతకీ ఆ ఇన్‌స్టాగ్రామ్ చుక్కలు ఎవరు? వాళ్ళ గురించి సింగర్ చిన్మయి శ్రీపాద ఏమన్నారంటే..
క్రింద పోస్టులో కనిపిస్తున్న వ్యక్తి చున్నీ ధరించి.. మీరు ఎలాగో వేసుకోరు కాబట్టి మేము వేసుకుంటానమంటూ అమ్మాయిలకు బోధిస్తున్నాడు. మరి అన్ని దుస్తులపై చున్నీలు వేసుకునే సౌలభ్యం ఉండదు. చున్నీలు వేసుకోకపోవడమే అన్ని దుర్మార్గాలకు కారణమంటూ మెసేజ్ ఇస్తున్నారు. వాస్తవానికి మన సమాజంలో జెండర్ ఈక్వాలిటీ, జెండర్ సెన్సిటైజేషన్ గురించి చదువుకున్న వారికి కూడా నాలెడ్జ్ లేకపోవడం ఒక దౌర్భాగ్యమైతే.. ఇలాంటి చుక్కల మెసేజ్ లే కరెక్ట్ అనుకోని ముఖ్యంగా గ్రామీణ యువత భావిస్తున్నారు. దీంతో మరింత అజ్ఞానం పెరుగుతోంది.
ఇంకా ఈ వ్యక్తి విషయానికి కొస్తే అమ్మాయిల జీవితమే పెద్ద నరకం, పాపం అన్నట్లు రోజు మాట్లాడుతుంటాడు. ముఖ్యంగా అమ్మాయిల ఋతుస్రావం(menstrual cycle) పీరియడ్స్ గురించి మాట్లాడుతూ.. అమ్మాయిల కంటే ఎక్కువగా మాట్లాడుతూ.. అమ్మాయిలకే ఇరిటేషన్ వచ్చేలా చేస్తుంటాడు. వీరిపై ఇప్పటికి సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్స్ జరుగుతున్న వీరు మారడం లేదు.
ఈ నేపథ్యంలోనే సింగర్ చిన్మయి శ్రీపాద మాట్లాడుతూ.. "మీకు ఈ చున్నీ పిచ్చి ఏంటి? అంతగా బాధ అనిపిస్తే మీరే వంద రూపాయలు పెట్టి ఓ చున్నీ కొనుకొని వేసుకోండి" అంటూ సెటైరికల్ గా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పై వ్యక్తులపై భారీ స్థాయిలో ట్రోలింగ్ జరుగుతున్న. అమ్మాయిల వస్త్రధారణ, మెంటల్ హెల్త్, ఈక్వాలిటీ, సెన్సిటైజేషన్ విషయంలో మెజారిటీ జనాలలో అవగాహన లేకపోవడం దురదృష్టకరం.