BulliRaju: లక్ష కావాలంటున్న బుల్లిరాజు..

ABN , Publish Date - Mar 17 , 2025 | 06:59 PM

రేవంత్‌ అంటే ఈ బుడ్డోడిని గుర్తుకు పట్టకపోవచ్చు కానీ బుల్లి రాజు అంటే మాత్రం టక్కున పట్టేస్తారు. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో బుల్లిరాజుగా  నటించి ప్రేక్షకుల్ని ఓ ఊపు ఊపాడు రేవంత్‌.

రేవంత్‌ (Revanth) అంటే ఈ బుడ్డోడిని గుర్తుకు పట్టకపోవచ్చు కానీ బుల్లి రాజు (Bulliraju) అంటే మాత్రం టక్కున పట్టేస్తారు. 'సంక్రాంతికి వస్తున్నాం' (sankranthiki vasthunnam) సినిమాలో బుల్లిరాజుగా  నటించి ప్రేక్షకుల్ని ఓ ఊపు ఊపాడు రేవంత్‌. సినిమా సక్సెస్‌లో తను కూడా భాగమయ్యాడు. అతని మాటలు, డైలాగ్‌ డెలివరీ, కామెడీ టైమింగ్‌లో సీనియర్లకు తీసి పోకుండా నటించి అలరించాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా హిట్‌తో బుల్లి రాజుకి అవకాశాలు వరుస కడుతున్నాయి. ఇప్పటికే బుల్లిరాజుకి దాదాపు 20 ఆఫర్లు వచ్చాయట. కానీ.. బుల్లి రాజు దేనికీ కమిట్‌ అవ్వడం లేదు. ఒకవేళ అయినా, రోజుకు రూ.లక్ష పారితోషికం డిమాండ్‌ చేస్తున్నాడట.

అతని డిమాండ్‌కి తగ్గట్టే నిర్మాతలు ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. తాజాగా అనిల్‌ రావిపూడి మరో సినిమాలో ఈ బుల్లి రాజుని లాక్‌ చేసినట్టు తెలుస్తోంది. చిరంజీవి తో అనిల్‌ ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో కూడా బుల్లి రాజుకు ఓ మంచి పాత్ర పడిందని సమాచారం.ఇందులో కథానాయికగా మృణాల్‌ ఠాకూర్‌ అని టాక్‌ నడుస్తోంది. జూన్‌ లేదా జూలైలో చిత్రీకరణ మొదలయ్యే అవకాశాలున్నాయి. 2026 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నారు. భీమ్స్‌ సంగీతం అందిస్తున్నారు. 

Updated Date - Mar 17 , 2025 | 07:01 PM