Chandrababu Naidu: ఇద్దరూ ప్రమాదకరం.. బాబు పంచ్ మామూలుగా లేదుగా
ABN , Publish Date - Feb 02 , 2025 | 12:08 PM
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన చెల్లెలు నారా భువనేశ్వరి హైదరాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు కార్యక్రమానికి హాజరై బాలయ్యను అభినందించారు.
"నందమూరి బాలకృష్ణ (Padma Bhushan Bala Krishna) నిన్నటి దాకా అల్లరి బాలయ్య.. ఇప్పుడు.. పద్మభూషణుడు. ఇప్పుడు ఆయన బాధ్యత మరింత పెరిగింది. ఎన్టీఆర్‌ను గుర్తు పెట్టుకునేలా బాలయ్య ప్రతి పని చేస్తున్నారు. ఆయనకు పద్మభూషణ్ రావడం, నా కుటుంబ సభ్యుడు కావడం గర్వంగా ఉంది. ఇది ప్రారంభం మాత్రమే. అన్‌స్టాపబుల్‌లో (Unstoppable Balayya) ఇది తొలి మెట్టు అనుకోవచ్చు’’ అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన చెల్లెలు నారా భువనేశ్వరి హైదరాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు కార్యక్రమానికి హాజరై బాలయ్యను అభినందించారు. వేదికపై బాలయ్యను, భువనేశ్వరిని (Bhuvaneswari) చమత్కరిస్తూ మాట్లాడారు. "ఒక పక్క బాలయ్య, ఇంకో పక్కన అంతే పవర్‌ఫుల్ భూ (భువనేశ్వరి) ఇద్దరి మధ్యలో నలిగిపోతున్నా. వీర్దిదరి మధ్య ఉంటే చాలా ప్రమాదం. భువనేశ్వరి తన అన్నయ్య మీదున్న ప్రేమతో ఈ వేడుక చేస్తోంది. (AP CM CBN)
ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక ఫీల్డ్‌లో ఏదో సాధించాలనుకుంటాం. బాలయ్య 1974లో నటుడిగా కెరీర్ ప్రారంభించారు. నేను 1978లో తొలిసారి ఎంఎల్‌ఏ అయ్యాను. నా కన్నా బాలయ్య నాలుగేళ్లు సీనియర్. ఎన్టీఆర్ ఓ చరిత్ర సృష్టించారంటే ఆయనలో ఉన్న పట్టుదల, క్రమశిక్షణ ఉన్నాయి. బాలయ్య పైకి అల్లరిగా కనిపిస్తాడు. కానీ లోపల చాలా డెప్ట్ ఉంది. ఒక్కోసారి మూడు గంటలకే నిద్రలేచి పూజలు చేస్తాడు. నాకే ఆశ్చర్యం వేస్తుంది. అలాంటివి నావల్ల కాదు. 50 ఏళ్లుగా సినిమాల్లో ఎవర్‌గ్రీన్ హీరోగా రాణిస్తున్నారు. నేటితరం దర్శకులతో కలిసి విభిన్నమైన చిత్రాల్లో యాక్ట్ చేస్తున్నారు. గొప్ప మానవతావాది. కేన్సర్స్ ఆస్పత్రిని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. హీరోగా, ఎమ్మెల్యే సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ముచ్చటగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఒక్కోసారి వసుంధరకు సీట్ ఇవ్వమంటాడు. నిజంగా అంటాడో.. ఆమెను మెప్పించడానికి తెలీదు. ఎంత ఎమోషనల్‌గా ఉంటాడో అంత మంచి మనిషి. నాకొక అద్భుతమైన బావమరిది దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నా’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పురంధేశ్వరి, చెల్లి భువనేశ్వరి, తమ సోదరుడు బాలయ్య చిరు ప్రశ్నలతో ఆటపట్టించారు. అనిల్ రావిపూడి, మలినేని గోపీచంద్, థమన్ తదితరులు పాల్గొన్నారు