Thandel: ఏఎన్నార్‌ సినిమాని రీమేక్ చేయనున్న చైతూ..

ABN , Publish Date - Feb 11 , 2025 | 09:10 PM

ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తండేల్‌ రాజుగా చైతన్య, సత్యగా సాయి పల్లవి తమ నటనతో ప్రేక్షకుల మదిని గెలుచుకున్నారు.

Naga Chaitanya and Chandoo Mondeti

నాగచైతన్య(Naga Chaitanya), సాయిపల్లవి జంటగా నటించిన ‘తండేల్‌’ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా జరిగిన ఈ చిత్ర సక్సెస్ ఈవెంట్ లో చిత్ర బృందంతో పాటు ముఖ్య అతిథులుగా నాగార్జున, శోభితా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే చిత్ర దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు


ఆయన మాట్లాడుతూ.. ‘‘నాగార్జున సర్‌.. చైతన్యకు హిట్‌ రావడంపై మీరెంత సంతోషంగా ఉన్నారో నాకు తెలుసు. మీకంటే రెట్టింపు ఆనందంలో మేం ఉన్నాం. ఇది మొదలు.. ఇకపై అన్ని సిక్సర్లే. ‘తండేల్‌’ కథను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ అర్థం చేసుకున్నంతగా ఎవరూ అర్థం చేసుకోలేదు. ఈ స్టోరీ ఆయన మ్యూజిక్‌ రూపంలోనే తెరపైకి వచ్చింది. ఆ తర్వాత నన్ను బాగా నమ్మింది ఎడిటర్‌ నవీన్‌ నూలి. ఈ కథకు మేం ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయినట్టే ప్రేక్షకులూ కనెక్ట్‌ అయ్యారు. గతంలో నేను తెరకెక్కించిన ‘సవ్యసాచి’ తర్వాత నిర్మాత బన్నీ వాసు నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చారు. అల్లు అరవింద్‌ గారిలో నాకు చాలా మంచి క్వాలిటీస్‌ కనిపించాయి. శోభిత మీరు తెలుగు బాగా మాట్లాడతారు. ఆ తెలుగును మా హీరోకి కూడా ట్రాన్స్‌ఫర్‌ చేసేయండి. ఎందుకంటే మేం భవిష్యత్తులో.. హిస్టారికల్‌ మూవీ చేయబోతున్నాం. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘తెనాలి రామకృష్ణ’ సినిమాను ఈ తరానికి తగ్గట్టు తీర్చిదిద్దుతాం. ఏఎన్నార్‌ అంతటి అభినయం మళ్లీ నాగచైతన్య చేస్తారు. మనం చూడబోతున్నాం’’ అన్నారు.


శ్రీకాకుళం జిల్లా మత్స్యలేశం గ్రామానికి చెందిన పలువురు వేటకు వెళ్లగా.. పాకిస్థాన్‌ కోస్ట్‌ గార్డుకు చిక్కి రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన ఘటన ఇతివృత్తంగా ఈ కథ సిద్ధమైంది. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తండేల్‌ రాజుగా చైతన్య, సత్యగా సాయి పల్లవి తమ నటనతో ప్రేక్షకుల మదిని గెలుచుకున్నారు. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో చైతన్య తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఎమోషన్‌కి గురి చేశారు. ఆయా సన్నివేశాలు కన్నీరు పెట్టించాయి. ఆ వీడియోలు నెట్టింట వైరల్‌ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తొలి రోజు రూ.21 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు నిర్మాణ సంస్థ పోస్టర్‌ విడుదల చేసి తెలిపింది.

Updated Date - Feb 11 , 2025 | 09:14 PM