Aha Ott: ఓటీటీలోకి బ్రహ్మా ఆనందం ఎప్పుడు.. ఎక్కడంటే 

ABN , Publish Date - Mar 13 , 2025 | 02:12 PM

టాలీవుడ్ కామెడీ బ్రహ్మ, బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్‌ తాత- మనవళ్లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది

టాలీవుడ్ కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం (Brahmanandam).. ఆయన కుమారుడు రాజా గౌతమ్‌ (Raja Goutham) తాత- మనవళ్లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’ (Brahma Anandam). ఆర్‌వీఎస్ నిఖిల్‌ (Nikhil) RVS) దర్శకత్వం వహించారు. కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా  ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైంది. బ్రహ్మానందం తనదైన శైలి నటన, కామెడీ టైమింగ్‌తో  ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.  ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి రానుంది. ఆహా వేదికగా (Aha OTT) ఇది మార్చి 14 నుంచి స్ట్రీమింగ్‌ (Brahma Anandam OTT Release) కానుందని టీమ్‌ వెల్లడించింది.


కథ :

బ్రహ్మానందం(రాజా గౌతమ్‌) ఓ థియేటర్‌ ఆర్టిస్ట్‌. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోతాడు. తాత మూర్తి (బ్రహ్మానందం), కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా దగ్గర లేకపోవడంతో నాకు నేనే అన్నట్లు స్వార్థంగా బతుకుతుంటాడు. ఎప్పటికైనా పెద్ద నటుడు కావాలన్నది తన కోరిక. దాని కోసం థియేటర్‌ ఆర్టిస్ట్‌గా ప్రయత్నాల్లో ఉండగా తన గురువు తనికెళ్ల భరణి సాయంతో ఢిల్లీలో జరుగుతున్న కళారంగ్‌ మహోత్సవంలో నాటకం వేేస అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడు. అయితే ఇందులో పాల్గొనాలంటే స్పాన్సర్‌షిప్‌గా రూ.6 లక్షలు ఇవ్వాలని ఈవెంట్‌ ఆర్గనైజర్‌ డిమాండ్‌ చేస్తారు. స్నేహితుడు గిరి (వెన్నెల కిశోర్‌)పై ఆధారపడి బతికే అతనికి ఆరు లక్షలు పుట్టడం కష్టం అవుతుంది. సరిగ్గా అప్పుడే వృద్థాశ్రమంలో ఉండే తన తాత మూర్తి అలియాస్‌ ఆనంద రామ్మూర్తి (బ్రహ్మానందం) తన పేరు మీద ఊర్లో కొంత భూమి ఉందని, తాను చెప్పినట్లు చేస్తే అది తనకు ఇస్తానని ఊరికి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్లాక ఏం జరిగింది? తాను చెప్పినట్లుగా బ్రహ్మకు మూర్తి పొలం రాసిచ్చాడా? దాని కోసం అతను  ఎలాంటి కండీషన్ పెట్టాడు. మూర్తి వృద్ధాశ్రమంలో ఉండిపోవడానికి కారణం ఏంటి? జ్యోతి (తాళ్లూరి రామేశ్వరి)కి మూర్తికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? బ్రహ్మను ఎంతో ఇష్టంగా ప్రేమించిన తార (ప్రియా వడ్లమాని) తనని ఎందుకు వదిలి వెళ్ళిపోయింది? నటుడు అవ్వాలనే బ్రహ్మ కోరిక నెరవేరిందా? లేదా అన్నది కథ.

Updated Date - Mar 13 , 2025 | 02:25 PM