Boyapati Srinu Recce: బాలయ్య కోసం బోయపాటి హిమాలయాల్లో బిజీ 

ABN , Publish Date - Mar 01 , 2025 | 04:26 PM

అఖండ 2: తాండవం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమా కోసం హిమాలయాల్లో రెక్కీ చేస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ(NBK) బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను  (Boyapati Srinu) కాంబోలో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ సినిమా  'అఖండ 2: తాండవం' (Akhanda 2: Thandavam). వీరిద్దరి కలయికలో వస్తున్న నాల్గవ సినిమా ఇది.14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు.  అఖండ 2: తాండవం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమా కోసం హిమాలయాల్లో రెక్కీ చేస్తున్నారు.

హిమాలయాల్లోని అద్భుతమైన ప్రదేశాలలో కొన్ని  ఎక్స్ ట్రార్డినరీ సన్నివేశాలను చిత్రీకరించడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఈ సన్నివేశాలు మూవీలో మెయిన్ హైలైట్ కానున్నాయని చెబుతున్నారు. హై బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సీక్వెల్‌లో సంయుక్త ఫీమేల్ లీడ్ గా కనిపించనుంది.  ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు,  దసరా కానుకగా ఈ చిత్రం సెప్టెంబర్ 25, 2025న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. 

Updated Date - Mar 01 , 2025 | 04:28 PM