Hari Hara Veera Mallu: బాబీ డియోల్ బర్త్‌డే స్పెషల్.. యుద్థానికి సిద్ధం
ABN , Publish Date - Jan 27 , 2025 | 12:54 PM
సోమవారం బాబీ డియోల్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో రాజుల కాలం దుస్తుల్లో ఉన్న బాబీ కత్తి పట్టుకొని యుద్థానికి సిద్థమవుతున్నట్లు కనిపించారు.
పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) కథానాయరుడిగా రానున్న చిత్రం ‘హరి హర వీరమమల్లు (Harihara Veeramallu) ’. క్రిష్, జ్యోతికృష్ణ (Jyothy krishna) దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఇది సిద్థమవుతోంది. ఈ చిత్రంలో బాబీడియోల్ (bobby Deol)ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. సోమవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో రాజుల కాలం దుస్తుల్లో ఉన్న బాబీ కత్తి పట్టుకొని యుద్థానికి సిద్థమవుతున్నట్లు కనిపించారు. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మెగా సూర్య మూవీస్ (Surya Movies) పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది. తొలిభాగం ‘హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ (Hariharaveemallu) పేరుతో విడుదల కానుంది. అనుపమ్‌ఖేర్, బాబీ దేవోల్, నిధి అగర్వాల్, నోరాహి ఫతేహి, విక్రమ్ జీత్, జిషు సేన్ గుప్త కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి స్వరాలు అందిస్తున్నారు.
ఇటీవల ఈ చిత్రంలోని మాట వినాలి’ అనే పాటను విడుదల చేశారు. పవన్ కల్యాణ్ పాడిన ఆ పాట చక్కని ఆదరణ పొందింది. ఇందులో పవన్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా.. స్వాతంత్య్రం కోసం పోరాడే ఓ యోధుడిగా కనిపించనున్నారు. 2025 మార్చి 28న ఈ చిత్రం మొదటి భాగం విడుదల కానుంది.
Read Also: Manchu Lakshmi: ఎయిర్ పోర్ట్ లో చేదు అనుభవం.. మండిపడ్డ లక్ష్మి
Shah Rukh Khan: షారుక్ ఖాన్.. కింగ్ షారుక్ ఖాన్ కానున్నాడు..