Bhagyashri borse: భాగ్యశ్రీ బోర్సేకు కీర్తి 'కాంత' కనకం...

ABN , Publish Date - Feb 14 , 2025 | 04:56 PM

'మిస్టర్ బచ్చన్' (Mr Bachchan) తో భాగ్యశ్రీ బోర్సే (Bhagyasri Borse) కు సూపర్ క్రేజ్ వచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది కానీ ఒక వేళ హిట్ అయిఉంటే... అమ్మడు ఓవర్ నైట్ క్రేజీ హీరోయిన్ అయిపోయి ఉండేది. అయినా... ఇప్పుడు కూడా భాగశ్రీ బోర్సే క్రేజ్ కు కొదవ లేదు.

హిందీలో చేసిన రెండు సినిమాల కంటే... తెలుగులో నటించిన ఒకే ఒక్క చిత్రం 'మిస్టర్ బచ్చన్' (Mr Bachchan) తో భాగ్యశ్రీ బోర్సే (Bhagyasri Borse) కు సూపర్ క్రేజ్ వచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది కానీ ఒక వేళ హిట్ అయిఉంటే... అమ్మడు ఓవర్ నైట్ క్రేజీ హీరోయిన్ అయిపోయి ఉండేది. అయినా... ఇప్పుడు కూడా భాగశ్రీ బోర్సే క్రేజ్ కు కొదవ లేదు. తొలి చిత్రం పరాజయం పాలైనా... భాగ్యశ్రీ చేసిన అందాల విందుకు ఫిదా అయిన దర్శక నిర్మాతలు కొన్ని అవకాశాలు ఇచ్చారు. నిజానికి 'మిస్టర్ బచ్చన్' పాటలను చూసి చాలామందికి భాగ్యశ్రీ బోర్సే మీద గురి కుదిరింది. తప్పకుండా శ్రీలీల (Srileela) తరహాలో ఆరేడు ఛాన్స్ లు వస్తాయని అనుకున్నారు. కానీ ఆమెకు కేవలం రెండే అవకాశాలు దక్కాయి. అయితే... అవి ప్రాధాన్యం ఉన్న సినిమాలు కావడం విశేషం. రామ్ పోతినేని (Ram Pothineni) సరసన అతని 22వ చిత్రంలో భాగ్యశ్రీ నాయికగా నటిస్తోంది. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. అలానే పాన్ ఇండియా మూవీ 'కాంత'లోనూ భాగశ్రీ బోర్స్ హీరోయిన్ గా చేస్తోంది.


Kamntha.jpg

'కాంత'(Kantha) సినిమాలో దుల్కన్ సల్మాన్ (Dulquer Salmaan) కథానాయకుడు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు. దీనిని రానా దగ్గుబాటి (Rana Daggubati), దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ దీనిని నిర్మిస్తున్నారు. 1950 నాటి మద్రాస్ నేపథ్యంలో 'కాంత' సినిమా తెరకెక్కుతోంది. రామ్ మూవీలో మహాలక్ష్మీగా ట్రెడిషనల్ లుక్ లో కనిపించబోతున్న భాగ్యశ్రీ బోర్సే... 'కాంత'లో అంతకు మించిన సంప్రదాయ బద్ధమైన పాత్రను చేస్తోంది. వాలెంటైన్స్ డే (Valentine's Day) సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ రెండు సినిమాలు విడుదలైన మంచి ఆదరణ పొందితే... తెలుగులోనే కాదు దక్షిణాదిలోనూ భాగ్యశ్రీ బోర్సేను ఇక ఆపేవారు ఉండరు. రామ్ సినిమా మాట ఎలా ఉన్నా, 'కాంత' మూవీతో ఆమెకు కీర్తి, కనకం బాగానే దక్కుతాయనని టాలీవుడ్ టాక్. చూడాలి మరి అమ్మడి అదృష్టం ఎలా రాసి ఉందో!!

Updated Date - Feb 14 , 2025 | 04:56 PM