Dr Anil Viswanadh: సాయి శ్రీనివాస్ తో పొలిమేర డైరెక్టర్ మూవీ

ABN , Publish Date - Mar 29 , 2025 | 06:25 PM

'పొలిమేర' చిత్ర దర్శకుడు అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన తొలి చిత్రం ఎట్టకేలకు విడుదల అవుతోంది. నవీన్ చంద్ర ఇందులో హీరోగా నటించాడు. అలానే తన 'పొలిమేర -3' వచ్చే సంక్రాంతి వస్తుందని అనిల్ చెబుతున్నారు.

'సత్యం' రాజేశ్ (Satyam Rajesh), డాక్టర్ కామాక్షి భాస్కర్ల జంటగా నటించిన సినిమా 'పొలిమేర' (Polimera). కరోనా టైమ్ లో ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ చిత్ర దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్‌ (Dr. Anil Viswanadh) వెంటనే 'పొలిమేర -2'ను తెరకెక్కించారు. ఆ సినిమా థియేటర్లలో విడుదలై అక్కడా తన సత్తాను చాటుకుంది. దాంతో త్వరలో 'పొలిమేర -3' కి శ్రీకారం చుట్టబోతున్నాడు. అయితే... ఈ సినిమాను మొదటి రెండు సినిమాలకు భిన్నంగా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో ఆయన రూపొందించబోతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ సీజీ వర్క్ తో మూవీ చేయబోతున్నారు. అందుకే దీని ప్రీ ప్రొడక్షన్ వర్క్ కు ఎక్కువ సమయం తీసుకుంటోందని అన్నారు. ఈ సినిమాను వచ్చే యేడాది సంక్రాంతి సీజన్ లో విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. భారీ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఉండబోతున్న 'పొలిమేర -3'లో ఓ స్టార్ కీలక పాత్ర పోషించబోతున్నారని డాక్టర్ అనిల్ విశ్వనాథ్‌ తెలిపారు.


విశేషం ఏమంటే 'పొలిమేర' కంటే ముందు 2017లో డా. అనిల్ విశ్వనాథ్‌ '28°C' అనే సినిమాను ప్రారంభించారు. రకరకాల కష్టాలను దాటుకుని అది 2020 నాటికి విడుదలకు సిద్థమైంది. అయితే అంతలో కరోనా వచ్చింది. దాంతో ఆ మూవీని పక్కన పెట్టేశారు. ఈ లోగా వచ్చిన 'పొలిమేర, పొలిమేర -2' చిత్రాల కారణంగా తిరిగి తన మొదటి చిత్రాన్ని జనం ముందుకు తీసుకు రావాలని అనిల్ నిర్ణయించుకున్నారు. ఇప్పుడీ సినిమా ఏప్రిల్ 4న విడుదల కాబోతోంది. నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా నటించిన ఈ సినిమాకు సాయి అభిషేక్ ప్రొడ్యూసర్. వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా కోసం జార్జియాలో 25 రోజుల పాటు ఎంతో కష్టపడి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించామని, విడుదల ఆలస్యమైనా ఈ సినిమా కథను పోలిన చిత్రాలేవీ ఈ నాలుగైదేళ్ళలో రాలేదని అనిల్ విశ్వనాథ్ చెప్పారు. అలానే అనిల్ విశ్వనాథ్ షో రన్నర్ గా వ్యవహరిస్తూ తన టీమ్ కు చెందిన నాని కాసరగడ్డ డైరెక్షన్ లో 'అల్లరి' నరేశ్‌ (Allari Naresh) తో '12ఎ రైల్వే కాలనీ' మూవీ చేస్తున్నారు. దీనిని అనిల్ విశ్వనాథ్‌ కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. అలానే త్వరలోనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) తో ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థిల్లర్ మూవీ ఒకటి చేయబోతున్నట్టు అనిల్ తెలిపారు.

Also Read: Nandamuri: యన్టీఆర్ ఫ్యామిలీకి అచ్చి వచ్చిన మార్చి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 29 , 2025 | 06:27 PM