Bandla Ganesh: బండ్లన్న.. ఏడుకొండల వరకూ పాద యాత్ర..
ABN , Publish Date - Mar 01 , 2025 | 04:57 PM
బండ్ల గణేష్‌కు (Bandla Ganesh) ఆధ్యాతిక చింతన ఎక్కువ. తిరుమల శ్రీనివాసుడు అంటే మరింత భక్తి ఆయనకు. ప్రస్తుతం ఆయన పాదయాత్ర (Paadayatra) చేయనున్నారని తెలిసింది.
బండ్ల గణేష్‌కు (Bandla Ganesh) ఆధ్యాతిక చింతన ఎక్కువ. తిరుమల శ్రీనివాసుడు అంటే మరింత భక్తి ఆయనకు. ప్రస్తుతం ఆయన పాదయాత్ర (Paadayatra) చేయనున్నారని తెలిసింది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు ఆయన పాదయాత్ర చేయబోతున్నారట. షాద్‌నగర్ నుంచి తిరుమల వరకూ పాదయాత్ర చేసి స్వామిని దర్శించుకోనున్నారని (Shadnagar to Tirumala) సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. షాద్‌నగర్ నుంచి తిరుమలకు సుమారు 500 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే ఇప్పుడు ఆయన పాదయాత్రకు కారణమేంటని ఆరా తీస్తున్నారు అభిమానులు. బండ్లన్న ఏదో పెద్ద సినిమానే ప్లాన్ చేశాడు.. అందుకే శ్రీవారిని ప్రసన్నం చేసుకోవడానికి పాదయాత్ర చేస్తున్నాడంటూ ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆయన పాదయాత్ర ఎప్పుడు ప్రారంభిస్తారనేది తెలియాల్సి ఉంది.
నటుడిగా కెరీర్ ప్రారంభించి నిర్మాతగా ఎదిగారు బండ్ల గణేష్. అగ్ర నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే ఆయన పవన్ కళ్యాణ్‌తో ఒక సినిమా ప్రకటించారు. ఇటు రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉంటున్నారు.