Bandi Sanjay: అన్ని పార్టీల నేతల సపోర్ట్ 'తకిట తధిమి తందాన' కే
ABN , Publish Date - Feb 18 , 2025 | 06:05 PM
చిన్న సినిమాలకు సైతం రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయ నేతలు పార్టీలతో నిమిత్తం లేకుండా బాసటగా నిలుస్తున్నారు. 'మర్డర్' ఫేమ్ ఘన ఆదిత్య హీరోగా నటించిన తాజా చిత్రం 'తకిట తధిమి తందాన' (Thakita Thadhimi Tandana).
చిన్న సినిమాలకు సైతం రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయ నేతలు పార్టీలతో నిమిత్తం లేకుండా బాసటగా నిలుస్తున్నారు. 'మర్డర్' ఫేమ్ ఘన ఆదిత్య హీరోగా నటించిన తాజా చిత్రం 'తకిట తధిమి తందాన' (Thakita Thadhimi Tandana). ఈ సినిమాతో హీరోయిన్ గా ప్రియ (Priya) పరిచయం అవుతోంది. రాజ్ లోహిత్ దర్శకత్వంలో చందన్ కుమార్ కొప్పుల ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 27న సినిమా జనం ముందుకు రాబోతోంది.
తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkata Reddy)'తకిట తధిమి తందాన' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆ మధ్య విడుదల చేశారు. తాజాగా కేంద్రమంత్రి, బీజేపీ నాయకులు బండి సంజయ్ (Bandi Sanjay) ఈ సినిమా టీజర్ ను విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. యూత్ తోపాటు, ఫ్యామిలీ ఆడియన్స్ ను అమితంగా ఆకట్టుకునేలా టీజర్ ఉందని ప్రశంసించిన బండి సంజయ్... ఈ చిత్రం ఘన విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. 'తకిట తధిమి తందాన' చిత్రం సినెటేరియా మీడియా వర్క్స్ ఆధ్వర్యంలో విడుదల కానుంది. నరేన్ రెడ్డి సంగీతం అందించిన ఈ చిత్రానికి శ్రేష్ఠ పాటలు రాశారు.