Akhanda 2: 'కుంభమేళా'లో అఖండ షూటింగ్ ఎందుకు.. అక్కడ అయిపోయింది కదా
ABN , Publish Date - Jan 22 , 2025 | 06:47 AM
Akhanda 2: 2021లో బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో వచ్చిన అఖండ చిత్రానికి కొనసాగింపుగా అఖండ-2: తాండవం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ప్రపంచంలోనే పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహా కుంభమేళాలో మూవీ చిత్రీకరణ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇంతకీ మహా కుంభమేళాలో ఈ మూవీ షూటింగ్ ఎందుకు చేశారు? నెక్స్ట్ ఎక్కడ చేయనున్నారంటే..
నందమూరి బాలకృష్ణ (NBK) హీరోగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అఖండ 2: తాండవం’ (Akahnda 2: Thandavam) . ప్రస్తుతం ప్రపంచంలోనే పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహా కుంభమేళాలో మూవీ చిత్రీకరణ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇంతకీ మహా కుంభమేళాలో ఈ మూవీ షూటింగ్ ఎందుకు చేశారు? నెక్స్ట్ ఎక్కడ చేయనున్నారంటే..
ఈ సినిమాని అఘోరా నేపథ్యంలో సాగే కథగా చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే. కాబట్టి ఈ సినిమాలో బాలయ్య మహా శివుడి భక్తుడిగా నటిస్తున్న నేపథ్యంలో కుంభమేళాలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. అక్కడ షెడ్యూల్ పూర్తి కావడంతో దర్శకుడు బోయపాటి నెక్స్ట్ లొకేషన్స్ కోసం రెక్కీ నిర్వహిస్తున్నాడు. అయితే ఆయన మంగళవారం ఏపీలోని కృష్ణ నదిలో బోటులో తిరుగుతూ కనపడ్డారు. ఆయనతో పాటు తన కొడుకుతో గుర్రంపై స్వారీ చేస్తూ కనిపించారు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రవహిస్తున్న కృష్ణ నది పరివాహక ప్రాంతాల్లో ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అలనాటి తార శోభన సన్యాసిగా నటిస్తున్నట్లుగా టాక్.
2021లో బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో వచ్చిన అఖండ చిత్రానికి కొనసాగింపుగా అఖండ-2: తాండవం తెరకెక్కుతోంది. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఎం.తేజస్విని సమర్పకులు. బోయపాటి, బాలయ్య కాంబోతో వస్తున్న నాలుగో చిత్రమిది. సెప్టెంబర్ 25న ఈ చిత్రానికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ సి రాంప్రసాద్, ఎడిటర్ తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్ లతో పాటు అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పని చేస్తున్నారు.