Balakrishna: ఉగాది రోజున ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్
ABN , Publish Date - Mar 28 , 2025 | 04:20 PM
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ, మోహిని జంటగా నటించిన సినిమా 'ఆదిత్య 369'. ఈ మూవీ ఏప్రిల్ 4న రీ-రీలీజ్ కాబోతోంది.
నందమూరి బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా రూపొందిన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’ (Aditya 369) 4 కె డిజిటలైజేషన్, 5.1 సౌండ్‌తో ఏప్రిల్ 4న రీ రిలీజ్ కానుంది. 1991లో విడుదలై సంచలన విజయాన్ని సాధించిన ఈ సినిమా రీ-రిలీజ్ సందర్భంగా మార్చి 30, ఉగాది రోజున నందమూరి బాలకృష్ణతో సహా చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణులతో హైదరాబాద్ లో రీ- రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ (Sivalenka Krishna Prasad).
ఈ సందర్బంగా శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ “నందమూరి బాలకృష్ణ గారు రెండు విభిన్న పాత్రల్లో అలరించి, మా సంస్థకి భారీ విజయాన్ని, చిరస్మరణీయ గుర్తింపుని అందించిన 'ఆదిత్య 369' చిత్రాన్ని ఏప్రిల్ 4న రీ-రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆ సంతోషాన్ని పంచుకోవడానికి మా నటీనటులు, సాంకేతిక నిపుణులు, మీడియా సమక్షంలో ఈ ఉగాదికి రీ-రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశాం. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు ఈ సినిమాను తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా తీర్చిదిద్దారు. చక్కని థియేటర్లు కూడా లభించడంతో వైభవంగా రీ-రిలీజ్ చేస్తున్నాం'' అని అన్నారు.
Also Read: Robinhood Review: 'రాబిన్ హుడ్'తో నితిన్, శ్రీలీల కోరిక నెరవేరిందా?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి