Bala Krishna: తమన్‌కు బాలయ్య భారీ గిఫ్ట్
ABN , Publish Date - Feb 15 , 2025 | 10:49 AM
మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు (SS Thaman) నందమూరి బాలకృష్ణ (NBK) సర్‌ప్రైజ్ ఇచ్చారు. తమన్ టాలెంట్‌ను అభినందిస్తూ విలువైన బహుమతి ఇచ్చారు.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు (SS Thaman) నందమూరి బాలకృష్ణ (NBK) సర్‌ప్రైజ్ ఇచ్చారు. తమన్ టాలెంట్‌ను అభినందిస్తూ విలువైన బహుమతి ఇచ్చారు. తాజాగా ఖరీదైన పోర్షే (Porsche car) కారును కొనుగోలు చేసి తమన్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు. కెరీర్ పరంగా మరెన్నో విజయాలు అందుకోవాలని ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ హైదరాబాద్‌లోని క్యాన్సర్ ఆస్పత్రిలో ఆంకాలజీ యూనిట్ ప్రారంభోత్సవంలో ఆయన(Nandamuri Balakrishna) తమన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘తమన్ నాకు తమ్ముడితో సమానం. వరుసగా నాలుగు హిట్లు ఇచ్చిన తమ్ముడికి ప్రేమతో కారు బహుమతి ఇచ్చాను. భవిష్యత్తులోనూ మా ప్రయాణం ఇలాగే కొనసాగుతోంది’’ అని అన్నారు. Nbk Porsche car Gift to Thaman)
వీరిద్దరి కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉంది. డిక్టేటర్’, ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి , ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహారాజ్’ చిత్రాలకు తమన్ స్వరకర్తగా పని చేశారు. ఆయా చిత్రాల విజయంలో మ్యూజిక్ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. అఖండ సినిమాకు తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. గూస్‌బంప్స్ వచ్చేశా తమన్ నేపథ్య సంగీతం అందించారు. అలా బాలయ్యకు, తమన్‌కు బాండింగ్ కుదిరింది. ఇటీవల డాకు మహారాజ్’ ఈవెంట్‌లో తమన్‌ని ఉద్దేశించి బాలయ్య ఆసక్తికర వ్యాఖ్య?ని చేశారు. ‘‘నందమూరి తమన్ కాదు.. ఎన్బీకే తమన్’’ అంటూ తమన్‌కు కొత్త పేరు పెట్టారు. తాజాగా బాలయ్య నటిస్తోన్న ‘అఖండ 2’ చిత్రానికి కూడా తమన్ స్వరాలు అందిస్తున్నారు.