Manju Warrier: హై యాక్షన్ డ్రామాగా ఆర్య 'మిస్టర్ ఎక్స్'

ABN , Publish Date - Feb 24 , 2025 | 05:58 PM

తమిళ స్టార్ హీరో ఆర్య ఇప్పుడో యాక్షన్ మూవీ చేస్తున్నాడు. మంజు వారియర్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో సీక్రెట్ ఏజెంట్ గా ఆర్య కనిపించబోతున్నాడు.

ప్రముఖ తమిళ నటుడు ఆర్య (Arya) నటించిన భారీ యాక్షన్ మూవీ 'మిస్టర్ ఎక్స్' (Mr. X). దేశాన్ని న్యూక్లియర్ వార్ నుండి కాపాడటం కోసం ఎవరికీ తెలియని సైనికులుగా కాపలాకాసే ఓ యాక్షన్ టీమ్ కథ ఇది. ఆర్యతో పాటు గౌతమ్ కార్తీక్ (Gautham Karthik), మంజు వారియర్ (Manju Warrier), శరత్ కుమార్ (Sarath Kumar), అనఘ, అతుల్య, జయప్రకాశ్‌ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.


'ఎఫ్.ఐ.ఆర్.' మూవీ తర్వాత మనూ ఆనంద్ (Manu Anand) డైరెక్ట్ చేసిన ఈ మూవీని 'లబ్బర్ పందు' (Lubber Pandhu) మూవీ నిర్మాణ సంస్థ ప్రిన్స్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా తెలుగులో టీజర్ విడుదలైంది. దేశానికి సంబంధించిన రహస్యాలను కాపాడటంతో పాటు... పరాయి దేశాల నుండి పొంచి ఉన్న ముప్పును అధిగమించడం కోసం ఎక్స్- ఫోర్స్ ఏం చేసిందనే అంశం ప్రధానంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ హై యాక్షన్ డ్రామాలో కాస్తంత ఫ్యామిలీ సెంటిమెంట్ కూ చోటు ఉందని టీజర్ చూస్తే అర్థమౌతోంది. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ చెబుతున్నారు.

Updated Date - Feb 24 , 2025 | 06:07 PM