Nandamuri Kalyan Ram: కల్యాణ్‌రామ్‌ కోసం ఆ టైటిల్‌..

ABN , Publish Date - Mar 04 , 2025 | 06:32 PM

నందమూరి కల్యాణ్‌ (Kalyan Ram) రామ్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రదీప్‌ చిలుకూరి (Pradeep Chilukuri) దర్శకుడు. విజయశాంతి (Vijayashanti) కీలక పాత్రలో కనిపిస్తారు.

నందమూరి కల్యాణ్‌ (Kalyan Ram) రామ్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రదీప్‌ చిలుకూరి (Pradeep Chilukuri) దర్శకుడు. విజయశాంతి (Vijayashanti) కీలక పాత్రలో కనిపిస్తారు. సాయి మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, అర్జున్‌ రాంపాల్‌ (Arjun Rampal) విలన్‌ రోల్‌ పోషిస్తున్నారు. ఈ సినిమాకు 'అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. ఇందులో విజయశాంతి పవర్‌ఫుల్‌ రోల్‌ చేస్తున్నారని సమాచారం. కొన్నేళ్ల గ్యాప్‌ తర్వాత ఆమె మహేశ్‌ నటించిన సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. తదుపరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్ర చేయడానికి అంగీకరించారు. ముప్పా వెంకయ్య చౌదరి, సునీల్‌ బలుసు, అశోక్‌ వర్దన్‌, కల్యాణ్‌ రామ్‌ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అజనీష్‌ లోక్‌నాథ్‌ స్వరాలు అందిస్తున్నారు.

Updated Date - Mar 04 , 2025 | 06:34 PM