Anasuya Ari Film: రిలీజ్‌కు ముందే సినిమా చూసే ఛాన్స్.. అస్సలు మిస్ చేసుకోకండి

ABN , Publish Date - Feb 10 , 2025 | 04:40 PM

అనసూయ భరద్వాజ్ 'అసూయ', సాయి కుమార్ 'గౌరవం', వైవా హర్ష 'కామం' ఎలిమెంట్స్‌ను రీప్రజెంట్ చేస్తూ 'పేపర్ బాయ్' సినిమా డైరెక్టర్ జయశంకర్ తెరకెక్కిస్తున్న సినిమా 'అరి'. ఈ సినిమా రిలీజ్ కాకుముందే మీరు చూసేయొచ్చు ఎలా అంటే..

పేపర్ బాయ్ సినిమాతో దర్శకుడిగా అందరినీ ఆకట్టుకున్నారు జయ శంకర్. 'అరి' అనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమాతో మరోసారి ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. ప్రస్తుతం సినిమాను ప్రమోట్ చేసుకునే పనిలో టీం బిజీగా ఉంది. ఇప్పటికే సైకో మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన అరి మూవీని ప్రత్యేకంగా ప్రదర్శించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మఠాధిపతులు, స్వామిజీలు ఈ మూవీని వీక్షించి ప్రశంసలు కురిపించారు.


భగవద్గీతలోని సారాన్ని అరి చిత్రంలో అద్భుతంగా చూపించారు అని చూసిన ప్రతీ ఒక్క ఆడియెన్ చెబుతున్నారు. ఈ చిత్రంలో అనసూయ, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్ వంటి భారీ తారాగణం నటించింది. అరిషడ్వర్గాల మీద తీసిన ఈ చిత్రం ఇప్పటి తరానికి చాలా ముఖ్యమని, సినిమా అద్భుతంగా ఉందని స్పెషల్ షోను చూసిన వారంతా పొగిడేస్తున్నారు. ఇక అరి మూవీని ప్రస్తుతం వీక్షించేందుకు కొంత మందికి అవకాశాన్ని కల్పిస్తోంది చిత్రయూనిట్.

WhatsApp Image 2025-02-10 at 14.05.42.jpegWhatsApp Image 2025-02-10 at 14.05.41.jpeg


మైథలాజికల్ థ్రిల్లర్ జానర్ల‌ను ఇష్ట పడే ఆడియెన్స్‌కు ఈ చిత్రం మరింతగా నచ్చేలా ఉంటుంది. సినీ లవర్స్ అంతా కూడా ముందుగానే అరి మూవీని చూసే అవకాశాన్ని చిత్రయూనిట్ కల్పిస్తోంది. ఇలా విడుదలకు ముందే సినిమాను చూపించే ధైర్యాన్ని ఎవ్వరూ చేయరు. కానీ అరి మీదున్న నమ్మకం దర్శకుడు జయశంకర్ ఇలా ప్రత్యేక ప్రదర్శనలు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. విడుదలకు ముందే సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించాలనుకునే వారు వివరాల్ని తెలియజేయండి అంటూ వాట్సప్ నంబర్‌ను కూడా డైరెక్టర్ జోడించారు.


WhatsApp Image 2025-02-10 at 14.05.43.jpegWhatsApp Image 2025-02-10 at 14.05.41 (1).jpeg

విభిన్నం గా సినిమా తీయడమే కాదు.. అంత కంటే విభిన్నం గా సినిమాని ప్రమోట్ చేస్తేనే ఈ రోజుల్లో ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించగలరు. ఇప్పుడు అరి మూవీ టీం కూడా ఇలానే డిఫరెంట్‌గా ప్రమోషన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. రిలీజ్‌కి ముందే సినిమాను చూపిస్తాం అని ఒక పోస్ట్ రిలీజ్ చేసింది. పేపర్ బాయ్ తో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ జయశంకర్ అరి మూవీతో త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాడు. జయ శంకర్ మూడో ప్రాజెక్ట్ కూడా కన్ఫామ్ అయింది. ఇంటెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్‌గా నటిచంనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటించనున్నారు.

Updated Date - Feb 10 , 2025 | 04:45 PM