Thandel Piracy: ఆర్‌టీసీలో తండేల్.. విచారణకు ఆదేశించిన ఛైర్మన్..
ABN , Publish Date - Feb 11 , 2025 | 10:36 AM
‘తండేల్’ (Thandel) 0సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ బారిన పడింది. రెండో రోజున ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో (Apsrtc) దీన్ని ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. దీనిపై నిర్మాత బన్నీ వాసు స్పందించారు.
‘తండేల్’ (Thandel) 0సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ బారిన పడింది. రెండో రోజున ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో (Apsrtc) దీన్ని ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. దీనిపై నిర్మాత బన్నీ వాసు స్పందించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ ఛైౖర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు తాజాగా దీనిపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై ఎంక్వైరీ చేసి పూర్తి వివరాలు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. (Thandel Piracy copy)
‘తండేల్’ పైరసీ సినీ ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశమైంది. దీని గురించి ఆ సినిమా నిర్మాతలు అల్లు అరవింద్ (Allu Aravind), బన్నివాసు (bunny vasu) ప్రెస్‌మీట్ నిర్వహించారు. పైరసీని ప్రోత్సహిస్తోన్న వారిపై మండిపడ్డారు. ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఆ పైరసీ ప్రింట్ ప్రదర్శించడం దారుణమని.. చిత్ర విజయాన్ని ఆస్వాదించే సమయంలో ఇదొక ప్రతిబంధకం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు తెలిసి, మరికొందరు తెలియక ఇలా సినిమాల్ని పైరసీ చేస్తున్నారని.. వాట్సప్, టెలిగ్రామ్ గ్రూప్స్‌లో ఆ లింక్స్‌ను ఫార్వర్డ్ చేస్తున్నారని అన్నారు. దాన్ని ప్రోత్సహిస్తున్న వారిని గుర్తించి కేసులు పెడుతున్నామని.. వాళ్లంతా జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు.
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రాజు, సత్య పాత్రల్లో చైతన్య, సాయి పల్లవి ఇమిడిపోయారు. తమ నటనతో ప్రేక్షకులను ఫిదా చేశారు.
ALSO READ: Victory Veduka: ఊహకు మించి చేరువ.. 2027లో మళ్లీ సంక్రాంతికి వస్తాం
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి