Pawan Kalyan: తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ ఏమన్నారంటే..
ABN , Publish Date - Mar 25 , 2025 | 02:14 PM
ఓ పక్క సెట్స్ మీద మూడు సినిమాలు, అటు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవ చేయడంలో బిజీగా ఉన్నారు పవన్ కల్యాణ్. తాజా ఆయన ఓ తమిళ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. రాజకీయంతో బిజీగా ఉన్నా మీరు సినిమాల్లో కొనసాగుతారా?
ఓ పక్క సెట్స్ మీద మూడు సినిమాలు, అటు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా (APDCM) ప్రజలకు సేవ చేయడంలో బిజీగా ఉన్నారు పవన్ కల్యాణ్ (Pawan Kalyan). తాజా ఆయన ఓ తమిళ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. రాజకీయంతో బిజీగా ఉన్నా మీరు సినిమాల్లో కొనసాగుతారా? అని సదరు యాంకర్ ప్రశ్నించగా పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. డబ్బు అవసరం ఉన్నంత వరకూ సినిమాల్లో నటిస్తూనే ఉంటానని తెలిపారు. (Acting career)
‘‘నేను ఎంతోమంది యోగులు, సిద్థులను చూసి స్ఫూర్తి పొందుతుంటాను. నిస్వార్థంగా ప్రజలకు ేసవ చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చాను. ఎప్పుడూ ఇదే ఆలోచనలో ఉంటాను. నేను సంపద కూడబెట్టుకోలేదు. సినిమా నిర్మాణరంగంలో భాగం కాను. ఎలాంటి వ్యాపారాలు లేవు. నాకు ఉన్న ఆదాయ మార్గం నటనే. నేను సినిమాలు చేస్తున్నంత వరకూ వాటికి న్యాయం చేయాలి. అలాగే నాకు డబ్బు అవసరం ఉన్నంత వరకు నటిస్తూనే ఉంటాను. అయితే, పరిపాలనకు ఎలాంటి ఆటంకం కలగకుండా నటిస్తాను’’ అని పవన్ చెప్పారు. పవన్‌కల్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. క్రిష్ జాగర్ల మూడి, జ్యోతికృష్ణల దర్శకత్వంలో హరిహరవీరమల్లు’లో నటిస్తున్నారు. ఇటీవలే దీని డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. దీనితో పాటు హరిశ్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’, సుజిత్ దర్శకత్వంలో ‘ఓజీ’ సినిమాల్లో పవన్ నటిస్తున్నారు.