Chandrababu Naidu: నటి కృష్ణవేణి మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం
ABN , Publish Date - Feb 16 , 2025 | 11:10 AM
సినీ నిర్మాత, నటి కృష్ణవేణి (Krishnaveni)మృతి బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (APCM CBN)అన్నారు.
సినీ నిర్మాత, నటి కృష్ణవేణి (Krishnaveni)మృతి బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (APCM CBN)అన్నారు. స్టూడియో అధినేతగా, వివిధ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి, రఘుపతి వెంకయ్య అవార్డు పొందిన కృష్ణవేణి తెలుగు సినీ కీర్తిని చాటారని తెలిపారు. కృష్ణవేణి ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం (N. Chandrababu Naidu) ప్రార్ధించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కూడా సంతాపం తెలిపారు.
"తెలుగు చలనచిత్ర రంగంలో తమదైన ముద్ర వేసిన సినీ నిర్మాత, తొలితరం హీరోయిన్ కృష్ణవేణి మృతి బాధ కలిగించింది. శోభనాచల స్టూడియో అధినేతగా, వివిధ చిత్రాలకు నిర్మాతగా, నటిగా ఆమె ఎనలేని సేవలు అందించారు. రఘుపతి వెంకయ్య అవార్డుతో పాటు ప్రతిష్టాత్మక అవార్డులను పొందిన కృష్ణవేణి తెలుగు సినీ పరిశ్రమకు వన్నె తెచ్చారు. కృష్ణవేణి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసున్నాను"
ALSO READ: RIP Krishnaveni: అలనాటి అందాల 'గొల్లభామ' కృష్ణవేణి కన్నుమూత
- రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్(Nara Lokesh)
“నేడు మన చలన చిత్ర సీమకు మరచిపోలేని చీకటి రోజు. మన కుటుంబానికి దైవం నాన్న, నందమూరి తారక రామారావు గారిని 1949లో ‘మన దేశం’ చిత్రంతో వెండితెరకు పరిచయం చేసిన మహాతల్లి, మన దేశం చిత్రం నిర్మాత శ్రీమతి కృష్ణవేణమ్మ గారు స్వర్గస్తులవడం మాకు తీవ్ర దుఃఖాన్ని కలిగించింది. ఆమె సినీ రంగానికి చేసిన సేవలు, వెండితెరకు చిరస్మరణీయమైన ప్రతిభావంతులను పరిచయం చేసిన గొప్పతనం ఎప్పటికీ మాకు మార్గదర్శకంగా నిలుస్తుంది. ఆమె లేకపోయినా ఆమె ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మా కుటుంబంపై ఉంటాయని ఆశిస్తున్నాము. మా కుటుంబం తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆ పరమాత్మ ఆమె ఆత్మకు శాంతి కలుగజేయాలని ప్రార్థిస్తున్నాము.”
- నందమూరి రామకృష్ణ
Bala Krishna: కృష్ణవేణి మరణం.. బాలయ్య ఏమన్నారంటే..