Anupama Parameswaran: 'పరదా' టీజర్‌.. పదేళ్ళ జర్నీ కనిపించింది

ABN , Publish Date - Jan 22 , 2025 | 09:03 PM

"ఈ సినిమా టీజర్‌ చేస్తుంటే నా పదేళ్ళ జర్నీ కనిపించింది. చాలా ఎమోషనల్‌ అయ్యాను. ఈ రోజు ఆనందంతో పాటు ఒక బాధ్యత కనిపిస్తుంది" అనుపమ పరమేశ్వరన్‌ అన్నారు.  


తన తొలి సినిమా ‘సినిమా బండి’ ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రవీణ్‌ కండ్రేగుల (Praveen Kandregula) తన రెండో చిత్రం ‘పరదా’తో (Parada)వస్తున్నారు.  శ్రీనివాసులు. పివి, శ్రీధర్‌ మక్కువతో కలిసి  విజయ్‌ డొంకడ ఆనంద మీడియా బ్యానర్‌ పై నిర్మిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్‌(Anupama Parameswaran), దర్శన రాజేంద్రన్‌ (darshana), సంగీత (Sangeetha) కీలక పాత్రలు పోషిస్తున్నారు. బుధవారం దుల్కర్‌ సల్మాన్‌ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.

అనుపమ పరమేశ్వరన్‌ మాట్లాడుతూ "ఈ సినిమా టీజర్‌ చేస్తుంటే నా పదేళ్ళ జర్నీ కనిపించింది. చాలా ఎమోషనల్‌ అయ్యాను. ఈ రోజు ఆనందంతో పాటు ఒక బాధ్యత కనిపిస్తుంది. ప్రేక్షకుల్ని అలరించడానికి  ఇలాంటి మంచి పాత్రలు మరిన్ని చేయాలనే బాధ్యత పెరిగింది. నేను ఇండస్ర్టీకి వచ్చి పదేళ్ళు అవుతుంది. ఈ పదేళ్ళలో నా మోస్ట్‌ ఫేవరేట్‌ ఫిలిం పరదా, మోస్ట్‌ ఫేవరేట్‌ క్యారెక్టర్‌ సుబ్బు. అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు. 

దర్శన మాట్లాడుతూ "ఇలాంటి సినిమా చేయడం చాలా కష్టం. చాలా టఫ్‌ ఛాలెంజ్‌ తీసుకున్నాడు దర్శకుడు.  అనుపమ, సంగీత గారితో వర్క్‌ చేయడం గ్రేట్‌ ఎక్స్‌ పీరియన్స్‌’’ అని అన్నారు.  

నిర్మాత మాట్లాడుతూ
"అనుపమ, దర్శన, సంగీత అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌ ఇచ్చారు.  ప్రవీణ్‌ ఈ సినిమాకి ప్రాణం పెట్టి పనిచేశాడు. భవిష్యత్తులో చాలా పెద్ద డైరెక్టర్‌ అవుతాడు. ఈ సినిమా మలయాళం రైటర్స్‌ దుల్కర్‌ తీసుకున్నారు. ఈ సినిమాతో గట్టిగా హిట్‌ కొడతాం’’ అన్నారు.

దర్శకుడు ప్రవీణ్‌ మాట్లాడుతూ " సినిమా ప్యాషన్‌ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఐడియాలు చాలా ఉంటాయి. కానీ ఒక నిర్మాత డబ్బు పెడితేనే ఇలాంటి సినిమా వస్తాయి. అనుపమ, దర్శన గారు కంటెంట్‌పై చాలా నమ్మకం పెట్టారు. పరిశ్రమలో అన్ని రకాల సినిమాలు రావాలి, ఈ సినిమా విమెన్‌ ఒరియంటెడ్‌ సినిమాలకి బిగ్‌ ఓపెనింగ్స్‌ ఇస్తుంది. ఈ సినిమాకి కమర్షియల్‌గా డబ్బులొస్తాయి. ఈ సినిమా క్రెడిట్‌ టీం అందరికీ దక్కుతుంది’’ అన్నారు.


Updated Date - Jan 22 , 2025 | 09:04 PM