Anupama Parameswaran: హిట్ పెయిర్ మరోసారి.. కలిసొస్తుందా.. 

ABN , Publish Date - Apr 26 , 2025 | 02:45 PM

శర్వానంద్‌ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయికగా అనుపమా పరమేశ్వరన్‌ ఎంపికైనట్లు కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి


శర్వానంద్‌ (Sharwanand) హీరోగా సంపత్‌ నంది (Sampath Nandi) దర్శకత్వంలో ఓ సినిమా  (Sharwanand-38) రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయికగా అనుపమా పరమేశ్వరన్‌ ఎంపికైనట్లు కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. అయితే ఆ వార్తలు నిజమేనని టీమ్‌ క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్‌లోకి అనుపమకు స్వాగతం (Anupama Parameswaran) పలుకుతూ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు.  2017 సంక్రాంతికి విడుదలై భారీ విజయం సాధించిన 'శతమానం భవతి’ చిత్రంలో శర్వా, అనుపమ పరమేశ్వరన్  జంటగా కనిపించి మెప్పించారు. ఈ చిత్రానికి నేషనల్‌ అవార్డు కూడా దక్కింది.

Anupama.jpg

ఇప్పుడు మళ్లీ ఈ జోడీ మరోసారి తెరపై సందడి చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. 1960ల కాలం నాటి నేపథ్యంలో పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో శర్వా ఇంతకుమునుపెన్నడూ పోషించని పాత్రలో కనిపిస్తారని టీమ్‌ తెలిపింది. ఈ సినిమా కోసం హైదరాబాద్‌ సమీపంలో ఓ భారీ సెట్‌ను సిద్థం చేశారు. షూటింగ్‌ మొత్తం అక్కడే పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - Apr 26 , 2025 | 02:45 PM