Anshu Ambani: త్రినాధ్ రావు అలాంటి వాడు కాదు..

ABN , Publish Date - Jan 13 , 2025 | 07:53 PM

Anshu Ambani: ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్న త్రినాధ్ రావు కామెంట్స్ పై నటి అన్షు అంబానీ రియాక్ట్ అయ్యింది. ఎవరు ఊహించని విధంగా ఆమె రియాక్ట్ కావడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు.

anshu ambani reacts to trinadh rao's comments

ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్న త్రినాధ్ రావు కామెంట్స్ పై నటి అన్షు అంబానీ రియాక్ట్ అయ్యింది. ఎవరు ఊహించని విధంగా ఆమె రియాక్ట్ కావడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల జరిగిన 'మజాకా' సినిమా టీజర్ ఈవెంట్ లో డైరెక్టర్ త్రినాధ్ రావు నక్కిన మాట్లాడుతూ.. అన్షు అంబానీ శరీర ఆకృతిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.


సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేష్, అన్షు అంబానీ లీడ్ రోల్స్ నటిస్తున్న సినిమా 'మజాకా'. ఈ సినిమాకి మాస్ కమర్షియల్ డైరెక్టర్ త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వం వహించాడు. కాగా ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ.. ‘‘మన్మథుడు’ సినిమా అప్పుడు హీరోయిన్‌ అన్షూ లడ్డూలాగా ఉండేవారు. ఆమెను చూడడానికే సినిమాకు వెళ్లేవాళ్లం. ఓ రేంజ్‌లో ఉండేవారు. కానీ అప్పటికంటే ఆమె కొంచెం సన్నబడ్డారు. తెలుగులో ఇది సరిపోదు. కొంచెం తిని పెంచమ్మా... అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలి అని చెప్పాను. ఫర్లేదు కొంచెం ఇంప్రూవ్‌ అయ్యారు. నెక్స్ట్‌ టైమ్‌కు బాగా ఇంప్రూవ్‌ అవుతారు’’ అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో అన్ని చోట్ల నుండి తీవ్రమైన ఆగ్రహజలాలు ఎగిశాయి.


ఈ క్రమంలోనే హీరోయిన్ 'అన్షు అంబానీ' వీటిపై రెస్పాండ్ అవుతూ.. ‘‘త్రినాథరావు చేసిన వ్యాఖ్యలపై చర్చ జరిగిందని తెలిసింది. ఆయనెంత మంచి వారో చెప్పేందుకే ఈ వీడియో. ఆయన ఎంతో స్నేహంగా ఉంటారు. నన్ను తన కుటుంబ సభ్యురాలిగా భావించారు. ఆయనపై నాకు గౌరవం ఉంది. టాలీవుడ్‌లో నా సెకండ్‌ ఇన్నింగ్స్‌కు ఇంత కంటే మంచి దర్శకుడు ఉండరేమో’’ అంటూ వీడియో రిలీజ్ చేసింది.

Updated Date - Jan 13 , 2025 | 08:16 PM