Chiranjeevi - Odela Srikanth: మళ్లీ అతనికే అవకాశం ఇచ్చారా.. హైప్‌ ఖాయం..

ABN , Publish Date - Feb 01 , 2025 | 09:14 AM

మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) - దసరా ఫేం శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela)కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే! దానికి ముందు నాని కథానాయకుడిగా శ్రీకాంత్‌ తెరకెక్కిస్తున్న ‘ది ప్యారడైజ్‌’ (The Paradise) సినిమా పూర్తి కావాలి.

మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) - దసరా ఫేం శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela)కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే! దానికి ముందు నాని కథానాయకుడిగా శ్రీకాంత్‌ తెరకెక్కిస్తున్న ‘ది ప్యారడైజ్‌’ (The Paradise) సినిమా పూర్తి కావాలి. ఆ తర్వాతే చిరంజీవి సినిమా ఫ్లోర్‌ మీదకు వెళ్తుంది. అయితే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ తదితర కార్యక్రమాలు జరుగుతున్నాయి.  ఈ సినిమాకు సంగీతం అందించే బాధ్యత యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుద్‌ చేపట్టే అవకాశాలున్నాయని టాక్‌ నడుస్తోంది. ప్రస్తుతం తెరకెక్కుతున్న నాని - శ్రీకాంత్‌ ఓదెల సినిమాకి సంగీతం అందిస్తున్నది ఆయనే. చిరంజీవి సినిమాకీ అనిరుద్థ్‌ (Anirudh Ravichander) సంగీతం అందించాడానికి ఒప్పించినట్టు ప్రచారం జరుగుతోంది. 



తమిళంలో అగ్రతారల రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, విజయ్‌ సినిమాలకి అనిరుధ్‌ స్వరకర్తగా పనిచేశారు. అయన  జోష్‌తో సినిమాను మరింత ముందుకు తీసుకెళ్లారు.  ఇప్పటికే తెలుగులో చాలా ,చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. ఇప్పుడు మరో అగ్ర హీరో చిరంజీవి సినిమాకోసం రంగంలోకి దిగారంటే అంచనాలు భారీ స్థాయికి చేరుకోవడం ఖాయమని తెలుస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఈ సినిమా నిర్మాణంలో కథానాయకుడు నాని కూడా భాగం పంచుకుంటున్న విషయం తెలిసిందే.    Aniruddh.jpg

Updated Date - Feb 01 , 2025 | 09:14 AM