Anil Ravipoodi: మరో ప్రాంఛైజ్‌కు రెడీనా...

ABN , Publish Date - Jan 13 , 2025 | 08:17 AM

అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌. ఇప్పటిదాకా ఆయన చేసిన ప్రతి సినిమా హిట్టే. దిల్‌ రాజు(Dil Raju) కాంపౌండ్‌ డైరెక్టర్‌గా మంచి విజయాలు అందుకున్నారు.

అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌. ఇప్పటిదాకా ఆయన చేసిన ప్రతి సినిమా హిట్టే. దిల్‌ రాజు(Dil Raju) కాంపౌండ్‌ డైరెక్టర్‌గా మంచి విజయాలు అందుకున్నారు. తాజాగా దిల్‌ రాజు బ్యానర్‌లో 'సంక్రాంతి వస్తున్నాం (Sankranthiki Vasthunam) సినిమాతో అలకించడానికి సిద్దమవుతున్నారు. ఇంతకుముందు ఇదే బ్యానర్‌లో వెంకటేష్‌ తో 'ఎఫ్‌2’, 'ఎఫ్‌ 3’ (F2, F3) సిరీస్‌ సినిమాలు చేసి సూపర్‌హిట్‌ చేశారు. అదొక సక్సెస్‌ ఫుల్‌ ఫ్రాంచైజ్‌ అయ్యింది. ఇప్పుడు ‘సంక్రాంతి వస్తున్నాం’ని కూడా ఫ్రాంచైజ్‌గా మలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా అనిల్‌ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ’’ఎఫ్‌2 లానే సంక్రాంతి వస్తున్నాం కూడా సీక్వెల్స్‌ తీయడానికి, కథని కొనసాగించడానికి మంచి అవకాశం వుంది. నాకు అయితే ఇందులో మరో సినిమా చేయాలనే వుంది’ అని అన్నారు అనిల్‌ రావిపూడి.

అనిల్‌ కామెడీ టైమింగ్‌ ఉన్న దర్శకుడు. అదే బలం బలం. ఆయన సినిమాలన్నీ ఈవివి సినిమాలను గుర్తు చేస్తాయి. ఆ మార్క్‌ని ఈ ట్రెండ్‌ కి తగ్గట్టుగా అందించడంలో మంచి పనితనం కనబరుస్తున్నాడు. 'సంక్రాంతి వస్తున్నాం' కథ పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. భార్య, ప్రేయసి మధ్య నలిగిపోయే భర్త క్యారెక్టర్‌ వెంకటేష్ పోషించారు. ఈ సినిమా సక్సెస్‌ అయితే దిల్‌ రాజు బ్యానర్‌కు మరో ఫ్రాంచైజ్‌ దొరికేసినట్లే. 

Updated Date - Jan 13 , 2025 | 08:18 AM