Anil Ravipudi: ఐటీ రైడ్స్‌పై అనిల్ రావిపూడి ఏమన్నారంటే..
ABN , Publish Date - Jan 23 , 2025 | 03:16 PM
మీ నిర్మాత దిల్‌రాజు ఐటీ రైడ్స్ బాధలో ఉంటే మీరు సక్సెస్ మీట్ చేసుకుంటున్నారని ప్రశ్న ఎదురవ్వగా అనిల్ సమాధానమిచ్చారు.
రెండు మూడు రోజులుగా టాలీవుడ్ అంతా ఐటీ డిపార్ట్‌మెంట్ రైడ్స్..(IT Raids) ఇదే హాట్ టాపిక్. పష్ప–2తో పాటు సంక్రాంతి బరిలో విడుదల చేసిన నిర్మాతలపై ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఇండస్ర్టీలోని ప్రముఖులపై జరుగుతోన్న ఐటీ సోదాళపై దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) స్పందించారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankarathiki VAstunnam) సక్సెస్‌మీట్‌లో పాల్గొన్న ఆయన దీని గురించి మాట్లాడారు. మీ నిర్మాత దిల్‌రాజు (Dil raju) ఐటీ రైడ్స్ బాధలో ఉంటే మీరు సక్సెస్ మీట్ చేసుకుంటున్నారని ప్రశ్న ఎదురవ్వగా అనిల్ సమాధానమిచ్చారు.
‘‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ పెట్టాం కదా.. అందుకే వాళ్లు కూడా సంక్రాంతికే రావాలని ఫిక్స్ అయ్యారేమో. దిల్‌రాజు బాధలో లేరు. ఆయన ఒక్కడిపైనే రైడ్స్ జరగడం లేదు. ఇండస్ర్టీలోని చాలా మందిపై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఇదంతా ఒక ప్రాసెస్‌లో భాగమే. ప్రతి రెండు, మూడేళ్లకు ఒకసారి ఇలా జరుగుతూనే ఉంటాయి. ఇండస్ర్టీ, బిజినెస్ వాళ్లపై ఇలా జరగడం సర్వసాధారణం. ‘నేను వచ్చినా రాకపోయినా.. ఈ సినిమా ప్రమోషన్‌ను ఆపొద్దు. ఈ విజయాన్ని మీరు ప్రేక్షకులతో పంచుకోండి’ అని దిల్ రాజు మాతో అన్నారు. అందుకే ఈ సినిమా విజయాన్ని పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాం’’ అని అన్నారు.
సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి.. మీ ఇంట్లో కూడా జరిగే అవకాశం ఉందా అని అడిగిన ప్రశ్నకు.. ‘నేను సుకుమార్ ఇంటి పక్కన లేను. ఫిబ్రవరిలో వాళ్ల ఇంటి పక్కకు షిఫ్ట్ అవుతాను. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి.. మా ఇంటికి కూడా వస్తారేమో’ అని నవ్వుతూ అన్నారు.