Anil Ravipudi: కష్టపడి వచ్చా.. దయచేసి అలా రాయొద్దు
ABN , Publish Date - Mar 01 , 2025 | 08:45 PM
యూట్యూబ్‌లో వచ్చే వీడియోలను ఉద్దేశించి దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) స్పందించారు. ఆ వీడియోలను తన సతీమణికి పంపి అనిల్ గురించి ఇలాంటి కథలు రాస్తున్నారేంటని అడుగుతున్నారు.
యూట్యూబ్‌లో వచ్చే వీడియోలను ఉద్దేశించి దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) స్పందించారు. ఆ వీడియోలను తన సతీమణికి పంపి అనిల్ గురించి ఇలాంటి కథలు రాస్తున్నారేంటని అడుగుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే సైబర్ పోలీసులకు (Cyber police) ఫిర్యాదు చేశానని అనిల్ రావిపూడి చెప్పారు. ఆయన మాట్లాడుతూ ‘‘నా గురించి ఇష్టం వచ్చినట్లు కథనాలు రాస్తున్నారు. అందమైన వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో?ని క్రియేట్ చేస్తున్నారు. యూట్యూబ్‌లో (Youtube Channels Abuse videos) ఆ వీడియోలు చూసిన మా బంధువులు ఆత్మీయులు.. వాటిని నా సతీమణికి పంపి అనిల్ గురించి ఇలాంటి కథలు రాస్తున్నారేంటని అడుగుతున్నారు. ఈ విషయంపై నేను ఇప్పటికే సైబర్ పోలీసు?కు ఫిర్యాదు చేశాను. కాబట్టి, మర్యాదగా వీడియోలు తీసేయండి. ఇకపై నా గురించి ఇలాంటి వీడియోలు చేయొద్దు. లేదంటే మిమ్మల్ని బ్లాక్ చేసేస్తారు. నా గురించి మాత్రమే కాదు చాలామంది గురించి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. క్లిక్స్ కోసం నచ్చిన కథలు అల్లి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేేసస్తున్నారు. అలాంటి వీడియోల వల్ల ఎంతోమంది వ్యక్తిగతంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి, లేని వార్తలు రాయొద్దు’’ అని అనిల్ రావిపూడి కోరారు.
ఇంకా ఆయన చెబుతూ ‘‘నేను మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిని. పరిశ్రమలోకి అడుగు పెట్టి 20 ఏళ్లు అవుతోంది. రచయితగా పేరు అందుకున్నాక డైరెక్షన్‌లోకి వచ్చా. ఈ క్రమంలో మూడేళ్లు ఇబ్బందులు పడ్డా. నటుడు కల్యాణ్ రామ్ నాపై నమ్మకం ఉంచి ‘పటాస్’ తెరకెక్కించే అవకాశం ఇచ్చారు. సినిమా పట్ల నాకున్న అభిరుచి, నమ్మకం ఆయనకు ఎంతో నచ్చాయి. దర్శకుడిగా నా ప్రయాణం మొదలై 10 ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్లలో ప్రేక్షకులు నాపై చూపించే ప్రేమాభిమానాలు నాకు ఆనందాన్ని ఇచ్చాయి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ నా సినిమాల గురించి గొప్పగా చెబుతుంటే సంతోషంగా ఉంటుంది’’ అని అన్నారు.