Anil Ravipudi: చిరంజీవితో సినిమా.. చాలా ఎర్లీ అవుతుంది!
ABN , Publish Date - Jan 04 , 2025 | 07:11 PM
గతంలో ఓ సినిమా తీయాలంటే మూడు, ఆరు, ఇంకా ఎక్కువైతే ఏడాది సమయం పట్టేది. అత్యంత వేగంగా సినిమాలు తీసేవారు. బడ్జెట్‌లు, భారీతనం పెరగడంతో స్టార్ హీరోల నుంచి ఏడాదికి ఓ సినిమా రావడమే గగనంగా ఉంది.
గతంలో ఓ సినిమా తీయాలంటే మూడు, ఆరు, ఇంకా ఎక్కువైతే ఏడాది సమయం పట్టేది. అత్యంత వేగంగా సినిమాలు తీసేవారు. బడ్జెట్‌లు, భారీతనం పెరగడంతో స్టార్ హీరోల నుంచి ఏడాదికి ఓ సినిమా రావడమే గగనంగా ఉంది. ఇప్పుడు స్టార్ హీరోలని తెరపై చూడాలంటే మినిమం రెండేళ్ల సమయం కావాల్సిందే. మరోవైపు దర్శకుల మేకింగ్ కూడా అలాగే ఉంది. నేటి దర్శకుల్లో అత్యంత వేగంగా సినిమాలు తీసే వ్యక్తిగా పూరి జగన్నాథ్‌కు పేరుంది. ఆయన సినిమా ప్రారంభం రోజే విడుదల తేదీని కూడా ప్రకటిస్తారు. ఇప్పుడు ఆ మార్కును అనిల్ రావిపూడి (Anil Ravipudi) బద్దలు కొడుతున్నారు. వెంకటేశ్ హీరోగా ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki vasthunnam). మీనాక్షిచౌదరి, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలు. చిత్రీకరణ, నిర్మాణనంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ప్రచార కార్యక్రమంలో భాగంగా అనిల్ రావిపూడి ఈ సినిమా మేకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. (sankranthiki vasthunnam in Short Schedule)
‘‘ఇతర పండగ తో పోలిస్తే సంక్రాంతికి వచ్చే సినిమాలను చూడాలని ప్రతి తెలుగు ప్రేక్షకుడు అనుకుంటాడు. ఈ ప్రాజెక్ట్ ఓకే అయినప్పుడే అందుకు తగినట్లుగానే విడుదల చేయా?ని అనుకున్నాం. మామూలుగా ముందు సినిమాకు సంబంధించిన సన్నివేశా?ని తీసేసి, ఎడిటింగ్ సమయంలో చూసుకుందామనుకుంటాం. కానీ, నా గత సినిమాలకు భిన్నంగా ఈసారి ప్రయత్నించాం. స్ర్కిప్ట్ సమయంలోనే ఎడిటింగ్ చేేసశాం. ఫలానా సీన్ మూడు నిమిాషాలు తీయాలనుకుంటే అంతే తీశాం. అందుకే ఈ చిత్రం 72 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. ‘ఎఫ్2’కు 74 రోజులు పట్టగా, రెండు రోజులు ముందుగానే ‘సంక్రాంతికి వస్తున్నాం’ పూర్తి చేశాం. మొత్తం సినిమా దాదాపు 2 గంటలా 26 నిమిషాలు వస్తే ఎడిట్ చేసిన సెన్సార్‌కు 2 గంటలా 22 నిమిషాల నిడివితో పంపాం. ఐదారు నిమిషాలకు మించి ఎడిట్ చేయలేదు. ఎప్పుడైతే తక్కువ వర్కింగ్ డేస్‌లో తీస్తామో అప్పుడు ప్రాజెక్ట్ ేసఫ్ హ్యాండ్స్‌లో ఉంటుంది. ఈ మూవీకి ఎంత బడ్జెట్ అవసరమో అంతకు ఏమాత్రం తగ్గకుండా తీశాం. క్వాలిటీ విషయంలో అస్సలు రాజీపడలేదు’’ అని అన్నారు.
‘‘స్టార్స్‌తో సినిమా చేయాలన్నది నా కల. అలా వెంకటేశ్, బాలయ్యబాబులతో చేశా. చిరంజీవిగారితో సినిమా చేస్తా.. ఇప్పుడే దాని గురించి మాట్లాడటం కాస్త తొందరే అవుతుంది. ఇక మహేశ్‌బాబు-రాజమౌళి కాంబోలో రాబోయే మూవీని ఎవరూ ఊహించలేరు’’అని అన్నారు. రాజమౌళి మూవీ పట్టాలెక్కేలోపు మహేశ్.. మీతో ఓ సినిమా చేస్తారని సోషల్‌మీడియా వార్తలు వైరల్ అయ్యాయి కదా అని అడగగా, ‘మధ్యలో నాతో సినిమా చేయడం కన్నా రాజమౌళిలాంటి గ్రేట్ డైరెక్టర్ మూవీకి కమిట్ అయి ఉండటమే బెటర్. ఈ విషయంలో మహేశ్‌బాబు చాలా క్లారిటీతో ఉన్నారు’ అని అనిల్ రావిపూడి సమధానమ్చిచారు..