Anasuya Bharadwaj: నాపై మీ పెత్తనం ఏంటి.. నేను లొంగను..
ABN , Publish Date - Feb 03 , 2025 | 09:22 AM
ఏదైనా సూటిగా మాట్లాడి సమస్యల్లో ఇరుక్కుంటారు అనసూయ. ఎన్ని విమర్శలు ఎదురైనా ఆమె రూట్ మాత్రం స్ట్రెయిట్ రూటే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు (Controversy Comments) చేశారు. సినిమా రంగంలో అమ్మాయిలపై ఎలాంటి దృష్టి కోణం ఉంది అనే విషయంపై మాట్లాడారు.
"సినిమా అనేది రంగుల ప్రపంచం. దీనిపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతుంటారు. అవకాశాల పేరుతో అమ్మాయిలను లోబర్చుకునే అవకాశం ఇక్కడ ఎక్కువ. అలా కాకుండా కళను నమ్మి అవకాశాలు ఇచ్చే రోజులు రావాలి. ఆ అమ్మాయి మన దగ్గరకు ‘రాకపోతే’ ఏంటి.. క్యారెక్టర్ బాగా చేస్తుంది కదా అని హీరోతో పాటు దర్శకనిర్మాతలు అనుకోవాలి. అప్పుడే చాలా మంది అమ్మాయిలు సినిమా రంగంలో సక్సెస్ కాగలరు’’ అని అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) అన్నారు.
ఏదైనా సూటిగా మాట్లాడి సమస్యల్లో ఇరుక్కుంటారు అనసూయ. ఎన్ని విమర్శలు ఎదురైనా ఆమె రూట్ మాత్రం స్ట్రెయిట్ రూటే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు (Controversy Comments) చేశారు. సినిమా రంగంలో అమ్మాయిలపై ఎలాంటి దృష్టి కోణం ఉంది అనే విషయంపై మాట్లాడారు.
నో చెప్పడం వల్ల ఎన్నో సమస్యలు.. (Say no)
ఆడ, మగ జాతుల మధ్య అట్రాక్షన్ అనేది కామన్. ఏ రంగంలోనైనా ఇది సహజంగా మారిపోయింది. అవకాశాల పేరుతో వాడుకునేందుకు చాలా మంది హీరోలతోపాటు దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తారు. నా విషయంలో కూడా అలా జరిగింది. ఓ స్టార్ హీరో అడిగితే నో చెప్పాను. అలాగే ఓ పెద్ద డైరెక్టర్ అడిగితే సున్నితంగా తిరస్కరించాను. దాని వల్ల చాలా ఆఫర్స్ నా వరకూ రాలేదు. రానివ్వలేదు. నో చెప్పడం కాదు అలా చెప్పడం వల్ల వచ్చే సమస్యలను కూడా ఎదుర్కొనే దైర్యం అమ్మాయిల్లో (Women Situation industry) ఉండాలి. ప్రపోజల్స్ అనేవి వస్తూనే ఉంటాయి. స్కూల్లోనే ప్రపోజ్ చేశారు. నో చెప్పాను. అలాగే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా అలాంటి ప్రపోజల్స్ వచ్చాయి. అప్పుడు ఎలా నో చెప్పానో ఇప్పుడు అలానే చెప్పాను. వాళ్లు కోరుకునేది ఇవ్వడం నాకు ఇష్టం లేదు. అలా చేేస్త ఏం జరుగుతుందో నాకు తెలుసు. దాని కన్నా కళను, మనలో ప్రతిభను చూసి పాత్రలు ఇస్తే బాగుంటుంది. ‘ఆమె రాకపోతే ఏంటి.. ఆ క్యారెక్టర్ అయితే బాగా చేస్తుంది కదా’ అని అనుకోవాలి. అప్పుడే చాలా మంది అమ్మాయిలు ఈ రంగంలోకి రాగలరు.
ఈజీ వే కరెక్ట్ కాదు
చాలా మంది ఎన్నో ఆశలలో సినిమా రంగంలోకి వస్తారు కానీ ఇక్కడ పరిస్థితులు వేరుగా ఉంటాయి. చాన్స్‌ల కోసం ఈజీ పద్దతి వెతుకుతారు. అది తప్పు. ఏది కరెక్ట్ అయితే అదే చెయ్. పది మంది తప్పు చేస్తున్నారు కదా.. నేను కూడా తప్పు చేస్తా అనడం కరెక్ట్ కాదు. నువ్వు తప్పు చేయకుండా ఉండు. ఈజీ వేలో కాకుండా నీ కష్టాన్ని,, కళను నమ్ముకొని ప్రయత్నించు. అలాంటి వారిని ప్రోత్సహించే రోజులు రావాలి. మార్పు మొదలైంది. మెల్లగా వస్తాయి
మీ పెత్తనం ఏంటి?
‘నన్ను ఇష్టపడేవాళ్ల కోసం నేను ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేస్తుంటాను. నేను ఎలాంటి ఫోటోలు అయినా షేర్ చేస్తా. అది నా ఇష్టం. నేను ఏం డ్రెస్ వేసుకోవాలి? బికినీ వేసుకోవాలా లేదా మొత్తం విప్పి తిరుగాలా’ అనేది నా ఇష్టం. దాన్ని వల్ల నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. కానీ నెగెటివ్ కామెంట్స్ పెట్టడం వల్ల నన్ను ఇబ్బంది పెడుతున్నారు కదా? అయినా నాపై మీ పెత్తనం ఏంటి? అంటూ నెటిజన్లపై అనసూయ మండిపడ్డారు.