Anasuya Bharadwaj: కాస్టింగ్ కౌచ్‌పై బాంబ్ పేల్చిన అనసూయ

ABN , Publish Date - Feb 04 , 2025 | 12:00 PM

Anasuya Bharadwaj: "ఇలా చెప్పడం వల్ల ఆఫర్లు నా వరకు రాలేదు, రానివ్వలేదు వాళ్ళు. అయితే నో చెప్పడమే కాదు, అలా చెప్పడం వల్ల వచ్చే సమస్యలను ఎదుర్కొనే ధైర్యం కూడా అమ్మాయిలకు ఉంటే మంచిది. ఇలాంటి వాటికన్నా.."

Anasuya Bharadwaj Reveals Shocking Secrets About Casting Couch

అనసూయ భరద్వాజ్.. సోషల్ మీడియాలో చాలా హేట్‌ని పేస్ చేస్తుంది. అయినా ఆమె తన అభిప్రాయాలను, కాంట్రవర్షియల్ విషయాలను స్ట్రెయిట్ గా చెప్పడంలో వెనక్కి తగ్గడం లేదు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె కాస్టింగ్ కౌచింగ్ గురించి, హేట్ కామెంట్స్ గురించి మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ స్టార్ హీరో, దర్శకుడు తనని కమిట్మెంట్ అడిగితే ఏం చేసిందో చెప్పింది. అలాగే ఇండస్ట్రీలో మహిళలు ఎదురుకుంటున్న సమస్యలపై మాట్లాడింది.


అనసూయ మాట్లాడుతూ "అమ్మాయిలు - అబ్బాయిల మధ్య అట్రాక్షన్ అనేది కామన్. సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఏ రంగంలోనైనా ఇది కామన్ గా మారింది. అయితే అవకాశాల పేరుతో వాడుకోవడానికి చాలామంది హీరోలతో పాటు దర్శక నిర్మాతలు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నా విషయంలో కూడా ఇలాంటివి జరిగాయి. ఓ స్టార్ హీరో అడిగితే డైరెక్ట్ గా నో చెప్పాను. అలాగే ఓ పెద్ద డైరెక్టర్ ప్రపోజల్ ను కూడా సున్నితంగా తిరస్కరించాను. ఇలా చెప్పడం వల్ల ఆఫర్లు నా వరకు రాలేదు, రానివ్వలేదు వాళ్ళు. అయితే నో చెప్పడమే కాదు, అలా చెప్పడం వల్ల వచ్చే సమస్యలను ఎదుర్కొనే ధైర్యం కూడా అమ్మాయిలకు ఉంటే మంచిది. ఇలాంటి వాటికన్నా కళను, మనలో ఉన్న ప్రతిభను చూసి పాత్రలు ఇస్తే బెటర్ అనిపిస్తుంది. ఆమె రాకపోతే ఏం ఈ క్యారెక్టర్ అయితే బాగా చేస్తుంది కదా అని అనుకున్నప్పుడు ఛాన్స్ వస్తే బాగుంటుంది. అలాంటప్పుడే చాలామంది అమ్మాయిలు ఈ రంగంలోకి అడుగు పెడతారని" చెప్పుకొచ్చారు.


అలాగే ఇండస్ట్రీలోకి ప్రవేశించేందుకు కొందరు ఈజీవే ఎంచుకుంటారు. అది సరైన నిర్ణయం కాదని అనసూయ మాట్లాడుతూ.. "పదిమంది తప్పు చేస్తున్నారు కదా అని, నేను కూడా చేస్తాను అనడం కరెక్ట్ కాదు. ఈజీ వేలో కాకుండా కష్టాన్ని, కళను నమ్ముకుని ప్రయత్నిస్తే మంచిది. మార్పు మెల్లగా మొదలైంది. టాలెంట్ ఉన్న వారిని ప్రోత్సహిస్తేనే ఇండస్ట్రీలోకి అమ్మాయిలు అడుగు పెడతారు. ఇక సోషల్ మీడియాలో నన్ను ఇష్టపడే వాళ్ళ కోసమే నేను ఫోటోలు షేర్ చేస్తాను. అక్కడ ఎలాంటి ఫోటోలు షేర్ చేస్తాను అనేది నా ఇష్టం. నేను బికినీ వేసుకోవాలా? లేదంటే మొత్తం విప్పి తిరగాలా ? అనేది నా ఇష్టం. దానివల్ల ఎవ్వరూ ఇబ్బంది పడట్లేదు. అయినా నాపై మీ పెత్తనం ఏంటి ?" అంటూ ఫైర్ అయ్యింది.

Also Read-Thandel Real Story: సంవత్సరం పైగా పాకిస్థాన్‌లో మగ్గిపోయాం  

Also Read-Sandeep Reddy Vanga: భద్రకాళిలో చిరు ఉగ్రరూపం..

Also Read- Balakrishna Favourite Heroines: బాలయ్య ఫేవరెట్ హీరోయిన్లు ఎవరో తెలుసా..

Also Read- Heroine Rakshita: గుర్తుపట్టలేని స్థితిలో పూరి హీరోయిన్..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 04 , 2025 | 12:38 PM