Allu Arjun: బన్నీ.. అట్లీ.. హీరోయిన్ ఎవరో తెలుసా..
ABN , Publish Date - Apr 29 , 2025 | 02:35 PM
అల్లు అర్జున్ (Allu arjun) హీరోగా అట్లీ (Atlee)దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇటీవల అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన గింప్స్‌ను విడుదల చేశారు.
అల్లు అర్జున్ (Allu arjun) హీరోగా అట్లీ (Atlee)దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇటీవల అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన గింప్స్‌ను విడుదల చేశారు. ముంబైలో చడీచప్పుడు కాకుండా షూటింగ్ షురూ చేసినట్టు టాక్. ఈ అయితే ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్‌లకు అవకాశం ఉందని తెలిసింది. జాన్వీ కపూర్ పేరు ముందు నుంచీ గట్టిగా వినిపిస్తోంది. మృణాల్ ఠాకూర్‌నీ కథానాయికగా ఎంచుకొన్నారని వార్తలొచ్చాయి. ఇప్పుడు మూడో హీరోయిన్ పేరు బయటకు వచ్చింది. ఇందులో మూడో హీరోయిన్‌గా అనన్యా పాండే (Ananya panday ఎంపికైనట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్ద పీట వేస్తున్న చిత్రమిదని ప్రకటన రోజు విడుదల చేసిన వీడియోతో అర్థమైంది. అంతర్జాతీయ గ్రాఫిక్స్ సంస్థలు ఈ సినిమా కోసం పని చేస్తున్నాయి. ఇందులో కథ ప్రకారం బన్నీ డ్యూయల్ రోల్‌ఓల కనిపిస్తారని మొదటి నుంచీ టాక్ నడుస్తోంది. సన్‌పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దాదాపు రూ.600 కోట్లకుపైగానే పెట్టుబడి పెడుతున్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.