Bunny Vas: బన్నీ విజన్‌కు పిచ్చోళ్లు అయిపోతారు..
ABN , Publish Date - Feb 07 , 2025 | 11:23 AM
సౌత్‌లో కంటే నార్త్‌లోనే పుష్ప గాడి సునామీ ఎక్కువగా కనిపించింది. ఏ ఇతర సౌత్ ఇండియన్ హీరోస్‌కు సాధ్యం కానీ.. నార్త్ ఇండియా మార్కెట్‌ని బన్నీ ఎలా క్రాక్ చేశాడో తెలిస్తే షాక్ అవుతారు.
అల్లు అర్జున్ 'పుష్ప 2' ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ లో కంటే నార్త్ లోనే పుష్ప గాడి సునామీ ఎక్కువగా కనిపించింది. ఏ ఇతర సౌత్ ఇండియన్ హీరోస్ కు సాధ్యం కానీ.. నార్త్ ఇండియా మార్కెట్ ని బన్నీ ఎలా క్రాక్ చేశాడో తెలిస్తే షాక్ అవుతారు. ఇది కేవలం పుష్ప నుంచి అమలు చేసిన స్ట్రాటజీ కాదని బన్నీ మాస్టర్ ప్లాన్ ని గీత ఆర్ట్స్ 2 నిర్మాత బన్నీ వాస్ బయటపెట్టాడు.
తాజాగా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో నాగ చైతన్య తండేల్ సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత, అల్లు అర్జున్ ఫ్రెండ్, అల్లు అరవింద్ అసోసియేట్ బన్నీ వాసు అనేక ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అయితే ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ 'పుష్ప 2' సక్సెస్ గురించి అడగగా ఆయన ఆశ్చర్యపోయే మాస్టర్ స్ట్రాటజీస్ బయటపెట్టాడు. ఆయన మాట్లాడుతూ.. " అల్లు అర్జున్ గారు, హిందీలో 2011 నుంచి రేట్స్ తక్కువ ఉన్నప్పుడు ఆయన మూవీస్ డబ్ చేయమని చెప్పేవారు. కొన్ని సార్లు ఆయన ఓన్ మనీతోనే రిలీజ్ చేసేవారు. అప్పుడు మాకు అర్ధం కాలేదు. ఎందుకు ఈయన ఇంతలా హిందీని పుష్ చేస్తున్నాడు అనిపించింది. కానీ.. దాని రిజల్ట్ మాకు 'పుష్ప 2'తో కనిపించింది." అన్నారు.
ఇక బన్నీ 300 కోట్ల రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతూ.. "ఏ హీరో ఎన్ని కోట్లు తీసుకున్నా 30 నుంచి 40 శాతం ట్యాక్స్ పే చేయాలి. ఆల్మోస్ట్ 39 శాతం ట్యాక్స్ లు ఉంటాయి వాళ్లకు. అంటే 100 కోట్లకు వాళ్ళు ఇంటికి తీసుకెళ్లేది 60 కోట్లు మాత్రమే. అందరు పుష్ప సినిమాకు 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు అంటున్నారు కానీ అది నాలుగేళ్లకు అని గుర్తించట్లేదు. పుష్ప, పుష్ప 2 సినిమాలకు అల్లు అర్జున్ 5 ఏళ్ళు కేటాయించారు. వేరే ఏ సినిమాలు చేయలేదు. ఒక వేళ తీసుకుంటే ఐదేళ్లు డివైడ్ చేస్తే సంవత్సరానికి ఎంతొస్తుంది. దానికంటే బయట చాలా మంది ఎక్కువ సంపాదిస్తున్నారు. అందరూ ఒక సినిమాకి అని చూస్తారు కానీ ఆ సినిమాకు మూడేళ్ళ కష్టం అని చూడరు. సుకుమార్ గారు కూడా రంగస్థలం తర్వాత మళ్ళీ పుష్పనే. ఐదేళ్లు వేరే ఏ సినిమాలు చేయలేదు. ఆయనకు వేరే బిజినెస్ లు లేవు. సినిమా ఎన్ని ఏళ్ళు అయితే అన్ని ఏళ్లకు కలిపి రెమ్యునరేషన్ ఇది" అని క్లారిటీ ఇచ్చారు.