Allu Arjun: బన్నీ సాధించిన మరో ఘనత.. ఏకంగా హాలీవుడ్‌లో..
ABN , Publish Date - Feb 20 , 2025 | 12:17 PM
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. సుకుమార్ దర్శకత్వం మాస్ మసాలా యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు హాలీవుడ్‌ను సైతం ఆకర్షించింది.
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) 'పుష్ప' చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. సుకుమార్ (Sukumar) దర్శకత్వం మాస్ మసాలా యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు హాలీవుడ్‌ను సైతం ఆకర్షించింది. తెలుగు సినిమాకు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు తీసుకొచ్చిన బన్నీ ఇప్పుడు మరో ఘనతను తన సొంతం చేసుకున్నారు. పముఖ సినిమా మ్యాగజైన్ ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ ఇప్పుడు ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ పేరుతో భారత్‌లోనూ అడుగుపెట్టేసింది. ఈ మ్యాగజైన్ తొలి సంచిక అల్లు అర్జున్ ఫొటోతో రానుంది. తాజాగా ఈ కవర్ పేజ్ ఫొటో షూట్‌ను నిర్వహించారు. ఆ బీటీఎస్ ప్రోమో వీడియోను తాజాగా షేర్ చేశారు. అందులో అల్ల్లు అర్జున్ పంచుకున్న కొన్ని విషయాలను చూపించారు. ‘సినిమాకు హద్దులు లేవని నిరూపించిన స్టార్ అల్లు అర్జున్: ది రూల్’’ పేరుతో ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాలో ఇంటర్వ్యూ రానుంది. ఇందులో అల్లు అర్జున్ ఇప్పటివరకు సాధించిన విజయాలను వివరించనున్నారు. ‘పుష్ప 2’ విజయంపై ఆసక్తికర వివరాలు పంచుకున్నట్లు తెలుస్తోంది. (Cover Feature on Hollywood Reporter)
Bapu Review: బ్రహ్మాజీ కీలక పాత్ర పోషించిన 'బాపు' ఎలా ఉందంటే..
అల్లు అర్జున్ చెప్పిన కొన్ని విషయాలు..(The Hollywood Reporter India) ‘‘ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాను. నా జీవితంలో లభించిన అతిపెద్ద అవకాశం ఇదే అని భావిస్తున్నా. బలం, ఆత్మవిశ్వాసం అనేవి మనసులో ఉంటాయి. వాటిని ఎవరూ తీసేయలేరు. ప్రతి మనిషికి కొన్ని లక్షణాలు పుట్టుకతో వస్తాయి. ఇది అలాంటిదే. విజయం తర్వాత కూడా వినయంగా ఉండటం చాలా ముఖ్యం. జీవితంలో సక్సెస్ అయిన తర్వాత కూడా ఎలాంటి గర్వం లేని చాలా మందిని నేను చూశా. అది వారి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఇకపోతే నేను 100 శాతం సామాన్యుడిని. సినిమా చూస్తున్నప్పుడు కూడా ఇదే భావనతో ఉంటాను. అలాగే విరామ సమయంలో కేవలం విశ్రాంతి మాత్రమే తీసుకుంటాను. ఏమీ చేయకుండా ఉండటమే నాకిష్టం. కనీసం పుస్తకం కూడా చదవను’’ అని ఆ ఇంటర్వ్యూలో అల్ల్లు అర్జున్ వివరించారు. ఈ ఇంటర్వ్యూలో బన్నీ ఇంకేం చెప్పుకొచ్చాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ALSO READ: Samantha: నేను అలా చేశా.. మీరు చేసి చూడండి.. మళ్లీ మళ్లీ చేస్తారు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి