Allu Arjun: బాలయ్య మీరు అర్హులు.. బన్నీ విషెస్‌

ABN , Publish Date - Jan 27 , 2025 | 02:33 PM

సినీ పరిశ్రమకు అందించిన సేవలు అందించినందుకుగాను నందమూరి బాలకృష్ణ, అజిత్‌ కుమార్‌ (Ajith kumar), శోభన(Sobhana), శేఖర్‌ కపూర్‌ తదితరులకు విస్‌ చేశారు బన్నీ.


పద్మభూషణ్‌ (Padmabhushan NBK) అవార్డులకు ఎంపికైన అందరికీ అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్‌ (Allu arjun) శుభాకాంక్షలు తెలిపారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమకు అందించిన సేవలు అందించినందుకుగాను నందమూరి బాలకృష్ణ, అజిత్‌ కుమార్‌ (Ajith kumar), శోభన(Sobhana), శేఖర్‌ కపూర్‌ తదితరులకు విస్‌ చేశారు బన్నీ.

‘‘పద్మభూషణ్‌కు ఎంపికైన సందర్భంగా బాలకృష్ణకు హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలుగు సినీ రంగానికి మీరు చేసిన సేవలకు ఈ పురస్కారాన్ని అందుకోవడానికి పూర్తిగా అర్హులు. అజిత్‌కుమార్‌ విజయం కూడా ఎంతోమందికి స్ఫూర్తిదాయకం, ప్రశంసనీయం. శోభన, శేఖర్‌ కపూర్‌లకు కళల విభాగంలో పద్మభూషణ్‌ రావడం ఎంతో ఆనందంగా ఉంది’’ అని ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. పద్మభూషణ్‌కు ఎంపిక చేసినందుకు బాలకృష్ణ, అజిత్‌లు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అభిమానుల ప్రోత్సాహం వల్లే ఈ స్థాయిలో ఉన్నట్లు వారు పేర్కొన్నారు. (Allu Arjun wishes to NBK)

‘నాకు పద్మభూషణ్‌ అవార్డు ప్రకటించిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఈ సందర్భంగా విష్‌ చేసిన అందరికీ థ్యాంక్స్‌. నా వెన్నంటే ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న నా అభిమానులకు, నాపై విశేష ఆదరాభిమానాలు చూపిస్తున్న ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని  బాలకృష్ణ అన్నారు.

Updated Date - Jan 27 , 2025 | 02:33 PM