Pushpa 3: పుష్ప ర్యాంపేజ్ వచ్చేది ఎప్పుడంటే..
ABN , Publish Date - Mar 16 , 2025 | 06:01 PM
అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్ చిత్రం ‘పుష్ప’. దీనికి సీక్వెల్‌గా గతేడాది పుష్ప-2 కూడా వచ్చి హిట్ అయింది. పుష్ప -3 గురించి నిర్మాత రవి శంకర్ అప్డేట్ ఇచ్చారు
అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్ చిత్రం ‘పుష్ప’. దీనికి సీక్వెల్‌గా గతేడాది పుష్ప-2 కూడా వచ్చి హిట్ అయింది. దీనికి మరో సీక్వెల్‌గా పార్ట్ -3 (Pushpa 3) ఉంటుందని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే పార్ట్- 3 రిలీజ్ ఎప్పుడుంటుందనే విషయాన్ని తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ వెల్లడించారు. ‘రాబిన్‌హుడ్’ ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడ వెళ్లిన ఆయన ‘పుష్ప’ సీక్వెల్ గురించి మాట్లాడారు. 2028లో ‘పుష్ప 3’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నట్లు తెలిపారు.
అల్లు అర్జున్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారని చెప్పారు. ‘పుష్ప’ ఫ్రాంచైజీలో భాగంగా 2021లో ‘పుష్ప ది రైజ్’ తెరకెక్కింది. దీనికి కొనసాగింపుగా పుష్ప-2 వచ్చింది. ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు పుష్ప 3: ది ర్యాంపేజ్’ రూపొందనున్నట్లు ఇప్పటికే టీమ్ ప్రకటించింది.
ALSO READ: Nagarjuna: నాగార్జున వందవ చిత్రానికి కసరత్తులు..
Sree Vishnu: ఐటెమ్ ఫిక్స్ అయినట్టేనా..