Allu Arjun: బన్నీకి షరతులు.. హైదరాబాద్ పోలీస్
ABN , Publish Date - Jan 06 , 2025 | 02:53 PM
Allu Arjun: గతేడాది డిసెంబర్ 4న గాయపడిన శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ వెళ్తారనే సమాచారం రాంగోపాల్‌పేట్ పోలీసులకు చేరింది. దీంతో నిన్న(ఆదివారం) ఉదయం పోలీసులు మెుదటిసారిగా బన్నీకి నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి మరోసారి..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun)కి హైదరాబాద్ రాంగోపాల్‌పేట్ పోలీసులు (Ramgopalpet Police) మరోసారి నోటీసులు అందించారు. సంధ్య థియేటర్ (Sandhya Theater) తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ (KIMS) ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న శ్రీతేజ్ (Sritej)ను పరామర్శించాలంటే ముందుగా తమకు సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బాలుడిని చూసేందుకు ఎప్పుడు రావాలనుకున్నా.. ముందుగానే ఇన్‌ఫర్మేషన్ ఇవ్వాలని, ఆ తర్వాత మాత్రమే అక్కడికి వెళ్లాలని సూచించారు.
కాగా, గతేడాది డిసెంబర్ 4న గాయపడిన శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ వెళ్తారనే సమాచారం రాంగోపాల్‌పేట్ పోలీసులకు చేరింది. దీంతో నిన్న(ఆదివారం) ఉదయం పోలీసులు మెుదటిసారిగా బన్నీకి నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయన మేనేజర్ మూర్తికి నోటీసులు అందజేశారు. శాంతిభద్రతల దృష్ట్యా శ్రీతేజ్‌ను చూసేందురు రావొద్దని తెలిపారు. బాలుడిని పరామర్శించేందుకు రావాలనుకుంటే తాము చెప్పే సూచనలు పాటించాలని, ఆ సమయంలో అనుకోని ఘటనలు జరిగితే దానికి బన్నీనే బాధ్యత వహించాలని చెప్పారు. అయితే నిన్న నోటీసులు అందించిన పోలీసులు తాజాగా ఇవాళ కూడా అందజేశారు.
ఇక సంథ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా.. ఆయనకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును అల్లు అర్జున్ ఆశ్రయించగా, ఓవైపు పోలీసుల తరపు న్యాయవాదులు అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. బన్నీతరపు న్యాయవాదులు మాత్రం బెయిల్ కోసం గట్టిగా వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం చివరకు అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేసింది.