Allu Arjun: కసరత్తుల వెనుక అసలు కారణం

ABN , Publish Date - Mar 05 , 2025 | 05:03 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేయబోతున్నాడు. అందులో ఒకటి త్రివిక్రమ్ మూవీ కాగా మరొకటి అట్లీ చిత్రం. ఈ రెండు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉండబోతున్నాయి.

బ‌న్నీ బాక్సాఫీస్‌ను మ‌రోసారి బ్లాస్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడా... అప్‌క‌మింగ్ మూవీని అంత‌కుమించి ఉండేలా చూసుకోబోతున్నాడా... త‌గ్గేదేలే అంటూ పాన్ ఇండియాను షేక్ చేసిన అల్లు వారాబ్బాయి.. ఈసారి పాన్ వర‌ల్డ్‌ను త‌గ‌ల‌బెట్టేలా ఉన్నాడు. సిట్యూవేష‌న్స్ చూస్తుంటే ఏదో పెద్ద సెన్సేష‌నే ప్లాన్ చేసిన‌ట్టు క‌నిపిస్తున్నాడు. పుష్ప-2 (Pushpa-2) సృష్టించిన సంచ‌ల‌నంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) స్థాయి ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ సినిమా కురిపించిన వ‌సూళ్ళను చూసి పాన్ ఇండియా నివ్వెర‌పోయింది. దీంతో బ‌న్నీ నెక్ట్స్ మూవీపైనే అంద‌రి దృష్టిప‌డింది. ఈసారి మూవీ ఎవ‌రితో.. ఎలాంటిదో అని ఫ్యాన్స్ ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. త‌దుప‌రి మూవీ ఎవ‌రితో అన్నది తేల‌లేదు కానీ... బ‌న్నీ చేస్తున్న క‌స‌ర‌త్తు, అదే స‌మ‌యంలో ఆయ‌న‌తో లైన‌ప్లో ఉన్న దర్శకుడు చేస్తున్న ప్రయత్నాలు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అవుతున్నాయి.


అల్లు అర్జున్ లైన్ అప్ లో రెండు మూవీస్ ఉన్నాయి. అందులో ఒక‌టి త్రివిక్రమ్ (Trivikram) ది కాగా.. మ‌రొక‌టి కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ (Atlee) ది. ఇప్పటికే అట్లీ మూవీ ప్రీ-ప్రొడ‌క్షన్ ప‌నుల్లో బిజీ అయిన‌ట్లు తెలుస్తోంది. ఇక‌ బ‌న్నీకి జోడీగా జాన్వీక‌పూర్ ని హీరోయిన్ గా తీసుకున్నట్టు ప్రచారం జ‌రుగుతోంది. మ‌రోవైపు స్టోరీ డిమాండ్ మేర‌కు ఐదుగురు విదేశీ భామ‌ల్ని కూడా తీసుకుంటున్నార‌ట‌. ప్రాజెక్ట్ ని పాన్ వ‌ర‌ల్డ్ క‌నెక్ట్‌కు చేసే యోచ‌న‌లో భాగంగా ఈ బ్యూటీల‌కు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్క సినిమాకై ఐదుగురు బ్యూటీలా!? అని అంద‌రూ ఆశ్చర్యపోతుంటే.. తాజాగా మ‌రో న్యూస్ ఆస‌క్తిరేపుతోంది.

అప్ క‌మింగ్ మూవీ కోసం ఇటీవ‌లే బ‌న్నీ విదేశాల్లో ట్రైనింగ్ తీసుకుని తిరిగివ‌చ్చాడు. అయితే ఈ ట్రైనింగ్ అట్లీ సినిమాకా.. త్రివిక్రమ్ మూవీ కోసమా అనేది తెలియడం లేదు. ఇంటర్నల్ లీకుల ప్రకారం అయితే అట్లీ సినిమా కోస‌మే బ‌న్నీ విదేశాల‌కు వెళ్లిన‌ట్లు తెలిసింది. బ‌న్నీ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఇంకాస్త డోస్ ఎక్కువ‌గానే అట్లీ హై ఆక్టేన్ స్క్రి ప్ట్ రాశాడట. బ‌న్నీ జిమ్నాస్టిక్, మార్షల్ ఆర్స్ట్ తెలిసిన న‌టుడు. ఈ నేప‌థ్యంలో బ‌న్నీ లో ఆ యాంగిల్ ని కూడా స్క్రి ప్ట్ లో ఇన్ బిల్ట్ చేసిన‌ట్టుగా చెప్పుకుంటున్నారు. దానికి సంబంధించే విదేశాల్లో ఓ స్పెష‌ల్ ట్రైన‌ర్ వ‌ద్ద 30 రోజులు ట్రైనింగ్ ఇప్పించిన‌ట్లు తెలుస్తోంది. మ‌రి అల్లు అర్జున్ చేసిన ఈ క‌స‌ర‌త్తు దేనికోస‌మో తెలియాలంటే మ‌రికొద్ది రోజ‌లు వెయిట్ చేయాల్సిందే.

Also Read: SSMB29: రాజమౌళి - మహేశ్ మూవీ ఏది నిజం... ఏది అబద్దం

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 05 , 2025 | 05:06 PM