Pushpa-2: పుష్ప-2 థ్యాంక్స్ మీట్.. బన్నీ ఏం మాట్లాడబోతున్నారు...
ABN , Publish Date - Feb 08 , 2025 | 03:48 PM
సంధ్య థియేటర్ ఘటన తర్వాత బన్నీ ఏ పబ్లిక్ మీటింగ్‌కు హాజరు కాలేదు. ‘తండేల్’ ప్రీ రిలీజ్‌కు ఆయన వస్తారని ప్రకటించారు. కానీ హాజరు కాలేకపోయారు. ఈ క్రమంలోనే నేడు జరగనున్న థాంక్స్ మీట్‌కు అల్ల్లు అర్జున్ హాజరుకానున్నారని వార్తలు వస్తుండటంతో అందరి దృష్టి దీనిపై పడింది.
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa2). డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1800 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమా విడుదలైన రోజు చోటుచేసుకున్న పరిణామాల రీత్యా చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం థాంక్స్ మీట్ కోసం ఏర్పాట్లు చేస్తోంది. శనివారం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలు కానుంది. అల్లు అర్జున్, సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ టీమ్‌తోపాటు ఇతర చిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం.
సంధ్య థియేటర్ ఘటన తర్వాత బన్నీ ఏ పబ్లిక్ మీటింగ్‌కు హాజరు కాలేదు. ‘తండేల్’ ప్రీ రిలీజ్‌కు ఆయన వస్తారని ప్రకటించారు. కానీ గ్యాస్ సంబంధిత సమస్యతో ఈ వేడుకకి హాజరు కాలేకపోయాని అల్లు అరవింద్ తెలిపారు. ఈ క్రమంలోనే నేడు జరగనున్న థాంక్స్ మీట్‌కు అల్ల్లు అర్జున్ హాజరుకానున్నారని వార్తలు వస్తుండటంతో అందరి దృష్టి దీనిపై పడింది. అల్లు అర్జున్ స్పీచ్‌లో ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తారా అని సినీప్రియులు ఎదురుచూస్తున్నారు. సంధ్య థియేటర్ ఘటన, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల గురించి ఆయన సింపుల్‌గా మాట్లాడవచ్చని టాక్ నడుస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా టీమ్ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో (Sandhya theater Stampade) పుష్ప-2 బెనిఫిట్ షో ప్రదర్శించగా డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల సమయంలో థియేటర్‌కు వచ్చిన అల్లు అర్జున్‌ను చూేసందుకు ఫ్యాన్స్ ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈక్రమంలో రేవతి, ఆమె తనయుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. రేవతి మృతిచెందగా.. శ్రీతేజ్ (Sritej) ప్రస్తుతం కిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు.