అట్లీతో సినిమా.. అదే సమస్య
ABN , Publish Date - Mar 02 , 2025 | 06:20 PM
అల్లు అర్జున్(Allu Arjun), తమిళ దర్శకుడు అట్లీ (Atlee) కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందని చాలాకాలంగా టాక్ నడుస్తోంది. త్వరలో అఫీషియల్‌గా ఈ విషయం బయటకు రానుందని కూడా టక్ నడుస్తోంది.
అల్లు అర్జున్(Allu Arjun), తమిళ దర్శకుడు అట్లీ (Atlee) కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందని చాలాకాలంగా టాక్ నడుస్తోంది. త్వరలో అఫీషియల్‌గా ఈ విషయం బయటకు రానుందని కూడా టక్ నడుస్తోంది. వీరిద్దరి కలయిక అంచనాలు భారీగా ఉంటాయి. ప్రస్తుతం అట్లీ వరుస హిట్‌లతో మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే.. అట్లీతో ఓ సమస్య వుంది. ఈ మధ్యన ఆయన రెమ్యునరేషన్ రూ.100 కోట్లకు పెంచేశారు. ఇది చూసి బడా నిర్మాతలే వెనక్కు తగ్గుతున్నారు. ‘జవాన్’ సినిమా తరవాత అట్లీ రేంజ్ మారింది.
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ కూడా జాతీయ స్థాయిని దాటుకుపోయింది. ఆయన కూడా రూ. 150 కోట్లు రెమ్యునరేషన్‌లో ఉన్నాడని టాక్ నడుస్తోంది. ఈ సినిమా గీతా ఆర్ట్స్‌లో చేసినా పారితోషికం అయితే ఇవ్వాల్సిందే. అంటే దర్శకుడుకీ, హీరోకీ రూ.250 కోట్లు అయిపోతుంది. బన్నీ మార్కెట్ ఉంద కాబట్టి, ఆమాత్రం ఇవ్వడానికి నిర్మాతలు కూడా సిద్దంగానే ఉంటారు. అయితే అట్లీ రూ.100 కోట్లు ఇచ్చే స్థాయి ఉందా? అన్నది ప్రశ్న. అట్లీకి అంత ఇవ్వలేకే.. తమిళ నిర్మాతలు సైడ్ అయిపోతున్నారు. ఇప్పుడు బన్నీ అట్లీ ప్రాజెక్ట్ ఎవరు తీసుకున్నా.. పారితోషికం దగ్గరే ఇష్యూ వస్తుంది. బన్నీకి ఇవ్వడానికి ఏ నిర్మాత వెనకడుగు వేయడు. అట్లీకి రూ.100 కోట్లు ఇవ్వడమే సమస్య. తమిళ నిర్మాతలే అట్లీని నమ్మకపోతే తెలుగులో ఎవరు నమ్ముతారు? అట్లీకి ఉన్న క్రేజ్‌ను బట్టి డిమాండ్ ఉండటం సహజం. కానీ మరీ రూ.100 కోట్లు అనే సరికి నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా ఉంటుందో చూడాలి.