Allu Aravind: తెల్ల తోలు ఉంటే సరిపోదు..

ABN , Publish Date - Feb 06 , 2025 | 09:53 AM

నటి సాయి పల్లవిని హీరోయిన్‌గా చూసినప్పుడు చాలా మంది ఈమె హీరోయిన్ ఏంటని కామెంట్స్ చేశారు. కానీ.. ఇప్పుడు ఆమె ప్రతిభను చూసి ప్రతి ఒక్కరు ఫిదా అయిపోతున్నారు.

Allu Aravind About Sai Pallavi

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం 'తండేల్'. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ‘బుజ్జి తల్లి, శివ శక్తి, హైలెస్సో హైలెస్సా’ పాటలు మ్యూజిక్ చార్టులలో టాప్ ప్లేస్‌లో, అలాగే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచాయి. ఈ నేపథ్యంలో నిర్మాత అల్లు అరవింద్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


తాజాగా ఓ ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ మాట్లాడుతూ..‘‘ఈ చిత్రంలో సాయి పల్లవి ఎంపిక నా నిర్ణయమే. ఇది కమర్షియల్‌ నిర్ణయమని చెప్పాలి. ఈ పాత్ర కోసం నేను ముంబయి వెళ్లి ఎవరినీ తీసుకురాలేదు. ముంబయి నుంచి వచ్చిన వైట్‌ స్కిన్‌ అమ్మాయిలు ఈ పాత్రకు జీవం తీసుకురాలేరనిపించింది. ఇది ఎన్నో భావోద్వేగాలతో కూడిన పాత్ర. ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతుంది. ఇలాంటి గొప్ప పాత్రను నిజాయతీగా చేయాలి. సాయిపల్లవి అయితే వంద శాతం న్యాయం చేయగలదని నాకు అనిపించింది. ఆమె అసాధారణమైన నటి. అందుకే ఆమెను ఎంపిక చేశాం. మేము అనుకున్నట్లుగానే సాయిపల్లవి వందశాతం న్యాయం చేసింది’’ అన్నారు.


మళ్ళీ యాక్టివ్ అయినా సాయి పల్లవి

ఇటీవల సాయిపల్లవికి విశ్రాంతి కావాలని వైద్యులు సూచించారు. ఆమె అనారోగ్యానికి గురయ్యారని దర్శకుడు చందు మొండేటి ముంబయిలో జరిగిన ‘తండేల్‌’ ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో చెప్పాడు. అందుకే ఆమె ఈవెంట్‌కి హాజరు కాలేకపోయారని తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘‘సాయిపల్లవి కొన్ని రోజుల నుంచి జ్వరం, జలుబు తో బాధ పడుతున్నారు. అయినా సినిమాకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో ఆమె మరింత నీరసించారు. వైద్యులు ఆమెకు కనీసం రెండు రోజులు బెడ్‌ రెస్ట్‌ అవసరమని సూచించారు. అందుకే ఆమె ముంబయి వేదికగా జరిగిన ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు’’ అని అన్నారు. కాగా, ఇప్పడు ఆమె పూర్తిగా కోలుకొని తండేల్ ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు.

Updated Date - Feb 06 , 2025 | 12:46 PM