Thandel: అవుట్ ఫుట్ లో.. ఆ జాగ్రత్తలు తీసుకున్నారట 

ABN , Publish Date - Feb 01 , 2025 | 08:21 AM

అల్లు యూనివర్సిటీ డీన్‌ అల్లు అరవింద్‌ (Allu Aravind) సినిమా ప్రమోషన్స్‌ కూడా బాగా ప్లాన్‌ చేశారు. తమిళనాట కార్తీని తీసుకొచ్చారు. ముంబై ఈవెంట్‌ లో అమీర్‌ ఖాన్‌ కనిపించాడు. త్వరలోనే ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ చేద్దామనుకొంటున్నారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్‌ అతిథిగా వస్తున్నాడు.


సినిమా జానర్‌ ఏదైనా అందులో ప్రేక్షకులు ఆస్వాదించే అన్ని అంశాలు ఉండాలి. అనుకున్న జానర్‌తోనే తెరపై చూపిస్తే ప్రేక్షకుల ఆదరణకు నోచుకోదు ఆ సినిమా. యాక్షన్‌ జానర్‌ సినిమా అనుకుంటే అందులో యాక్షన్‌ పార్ట్‌ ఒకటే ఉంటే సరిపోదు.
వినోదం, యాక్షన్‌, ఫైట్లు, పాటలు, రొమాన్స్‌ ఇలా అన్ని అంశాలు ఉండాలి. అలా ఉంటేనే జనాలకు ఎక్కుతుంది. లేదంటే మార్నింగ్‌ షో తర్వాత ఆ సినిమా పక్కకు వెళ్లాల్సిందే. ప్రస్తుతం ‘తండేల్‌’ (Thandel) విషయంలోనూ అలాంటి జాగ్రత్తలు తీసుకొన్నారట మేకర్స్‌. టీజర్‌, ట్రైలర్‌లలో ఎమోషన్‌ కంటెంట్‌ ఎక్కువగా చూపించారు. వినోదానికి, నవ్వులు పూయించడానికి పెద్దగా స్కోప్‌ లేని కథ ఇది. సినిమా అవుట్‌పుట్‌ అంతా చూశాక ఎక్కడో సీరియస్‌ సినిమా అనే స్మెల్‌ కొట్టడంతో చివర్లో కొన్ని సరదా సన్నివేశాల్ని యాడ్‌ చేసి, షూట్‌ చేశారని సమాచారం. ఏ సినిమాకేౖనా ఇలాంటి జోడింపులు సహజంగా జరుగుతుంటాయి. పైగా తండేల్‌కు కావల్సినంత సమయం ఉంది. డిసెంబరులో ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకున్నారు. సంక్రాంతి రేసులోనూ తండేల్‌ పేరు వినిపించింది. కానీ చివరికి ఫిబ్రవరి 7 కు (Thandel on 7 Feb) వాయిదా పడింది. ఈలోపు కావలసినంత రిపేర్‌ చేసుకునే సమయం దొరికింది. సో దాంతో సినిమాలో వినోదాన్ని జోడించారని తెలిసింది.




అల్లు యూనివర్సిటీ డీన్‌ అల్లు అరవింద్‌ (Allu Aravind) సినిమా ప్రమోషన్స్‌ కూడా బాగా ప్లాన్‌ చేశారు. తమిళనాట కార్తీని తీసుకొచ్చారు. ముంబై ఈవెంట్‌ లో అమీర్‌ ఖాన్‌ కనిపించాడు. త్వరలోనే ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ చేద్దామనుకొంటున్నారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్‌ అతిథిగా వస్తున్నాడు. ఇక ‘పుష్ప 2’ తరవాత బన్నీ విషయంలో చాలా వ్యవహారాలు జరిగాయి. ప్రస్తుతం ఆయన మీడియా ముందుకు రావడం లేదు. కొంత గ్యాప్‌ తర్వాత బన్నీ కనిపించే ఫంక్షన్‌ ఇదే కావడంతో జనాలు ఫోకస్‌ బాగా ఉంది. ఫిబ్రవరి 6 న ప్రీమియర్‌ షోలు వేేసందుకు చిత్రబృందం రెడీ అవుతోంది. అయితే ప్రభుత్వం నుంచి అనుమతి దక్కడమే ఆలస్యం.  

Chiranjeevi - Odela Srikanth: మళ్లీ అతనికే అవకాశం ఇచ్చారా.. హైప్‌ ఖాయం..

నాగచైతన్య(Naga Chaitanya) , సాయిపల్లవి (Sai Pallavi)జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై బన్నీ వాస్‌ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

READ MORE: Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ దోప్‌ సాంగ్‌ ఫుల్‌ వీడియో

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 01 , 2025 | 12:23 PM