Thandel: 100 మార్కులొచ్చేశాయి.. ఇక రాజులమ్మ జాతరే

ABN , Publish Date - Jan 27 , 2025 | 10:38 AM

తండేల్ సినిమా గురించి నిర్మాత బన్నీ వాస్‌ (Bunny vas) ట్విట్టర్‌లో ఆసక్తికర పోస్ట్‌ చేశారు. ఎడిట్‌ సూట్‌లో కూర్చుని కట్స్‌ చూస్తున్న ఫొటోను షేర్‌ చేసి ఏమన్నారంటే

నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి (Sai pallavi) జంటగా నటిస్తున్న 'తండేల్‌’ (Thandel) పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా జరుగుతోంది. మరో పక్క ప్రమోషన్స్‌ కూడా ముమ్మరం చేసిందీ చిత్ర బృందం. ఇప్పటికే విడుదలైన పాటలు చక్కని ఆదరణ పొందుతున్నాయి. ఈ నెల 28న ట్రైలర్‌ విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 7న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపధ్యంలో నిర్మాత బన్నీ వాస్‌ (Bunny vas) ట్విట్టర్‌లో ఆసక్తికర పోస్ట్‌ చేశారు. ఎడిట్‌ సూట్‌లో కూర్చుని కట్స్‌ చూస్తున్న ఫొటోను షేర్‌ చేసి "అల్లు యూనివర్సిటీ డీన్‌ అల్లు అరవింద్‌గారు (Allu Aravind) సినిమా అవుట్‌పుట్‌ను సర్టిఫై చేశారు. డిస్టిన్‌క్షన్‌లో పాస్‌ అయిపోయాము’’ అని ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌కు గీతా ఆర్ట్స్‌ ట్విట్టర్‌ పేజ్‌ రిప్లై ఇస్తూ.."అల్లు అరవింద్‌ గారు వంద మార్కులు ఇచ్చారు.  థియేటర్స్‌లో దుల్లగొట్టేయాల్సిందే. ఇక రాజులమ్మ జాతరే’’ అని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్‌ వైరల్‌గా మారారు.


Thandel.jpg
చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై టీమ్‌ ఎంత నమ్మకంగా ఉన్నారు. తాజాగా ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు చందూ ఎంతో కాన్ఫిడెంట్‌గా సినిమా గురించి మాట్లాడారు. అవుట్‌పుట్‌ చూసిన అల్లు అరవింద్‌ 100 మార్కులు ఇచ్చేశారు. అల్లు అరవింద్‌ సర్టిఫై చేశారంటే.. సినిమా రేంజే వేరుగా ఉంటుందని అభిమానులు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్‌ మిసైల్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. 

Updated Date - Jan 27 , 2025 | 10:38 AM