Allu arjun: అయిదేళ్ల అలా వైకుంఠపురంలో.. ఎంతో  ప్రత్యేకం 

ABN , Publish Date - Jan 13 , 2025 | 01:57 PM

అల్లు అర్జున్‌ హీరోగా నటించిన చిత్రం 'అల వైకుంఠపురములో’. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో కూపొందిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. అల్లు అరవింద్‌, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు.

అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా నటించిన చిత్రం 'అల వైకుంఠపురములో’ (Ala Vaikuntapuramulo) . త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ (Trivikram) దర్శకత్వంలో కూపొందిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. అల్లు అరవింద్‌, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. 2020లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా వచ్చి ఐదేళ్లు పూర్తి కావడంతో అల్లు అర్జున్‌ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రం నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థ్థానాన్ని కలిగి ఉంటుందని పోస్ట్‌ చేశారు.

ఇంతటి ఘన విజయాన్ని అందించిన త్రివిక్రమ్‌, చినబాబు, అల్ల్లు అరవింద్‌, తమన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ అద్భుతమైన చిత్రానికి జీవం పోసిన నటీనటులు, సిబ్బందితో పాటు మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు అంటూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ మూవీ సమయంలో దిగిన ఫోటోలను షేర్‌ చేశారు. ప్రస్తుతం బన్నీ చేసిన పోస్టర్‌ వైరల్‌గా మారింది.

Updated Date - Jan 13 , 2025 | 01:57 PM