Nagarjuna: నిరాశలో అక్కినేని అభిమానులు

ABN , Publish Date - Feb 04 , 2025 | 03:37 PM

ఆ జనరేషన్‌ హీరోల్లో నాగార్జున (Nagarjuna) కాస్త వెనకబడి ఉన్నారు. అదే అభిమానుల్ని కాస్త ఇబ్బందికి గురి చేస్తోంది.  ప్రస్తుతం నాగార్జున సోలో హీరోగా ఒక్క సినిమా కూడా లేదు. దీనితో అభిమానులు స్పీడ్  పెంచాలని సూచన చేస్తున్నారు 


టాలీవుడ్‌ అగ్ర హీరోలు చిరంజీవి(Chiranjeevi), వెంకటేష్‌, బాలకృష్ణ.. మంచి ఫామ్‌లో ఉన్నారు. మెగాస్టార్‌ చిరంజీవి ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ చేస్తున్నారు. తర్వాత కూడా రెండు చిత్రాలు ప్రకటించి ఉన్నారు. ఒకటి అనిల్‌ రావిపూడితో, మరొకటి శ్రీకాంత్‌ ఓదెలతో చేయబోతున్నారు. బాబీ కొల్లితో ఓ సినిమా ఉండబోతుందని టాక్‌ నడుస్తుంది. నటసింహం బాలకృష్ణ (Balakrishna) గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన కూడా మంచి జోరు మీదున్నారు. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఆయన జోరు మామూలుగా లేదు. తాజాగా డాకు మహారాజ్‌తో హిట్‌ అందుకున్నారు. అలాగే ఓటీటీలో అన్‌స్టాపబుల్‌తో మంచి క్రేజ్‌ తెచ్చుకున్నారు. త్వరలో ఆఖండ-2 సెట్‌లో అడుగుపెట్టనున్నారు. కొంతకాలంగా పరాజయాలతో సతమతమవుతున్న విక్టరీ వెంకటేష్‌ (Venkatesh) ‘సంక్రాంతికి వస్తున్నాం’తో అద్భుతమైన విజయం అందుకొన్నారు. అన్ని వర్గాల ఆడియన్స్‌లోనూ వెంకీ స్టామినా చూపించారు. అయితే ఆ జనరేషన్‌ హీరోల్లో నాగార్జున (Nagarjuna) కాస్త వెనకబడి ఉన్నారు. అదే అభిమానుల్ని కాస్త ఇబ్బందికి గురి చేస్తోంది.  


ప్రస్తుతం నాగార్జున చేతిలో రెండు సినిమాలు రెండు సినిమాలున్నాయి. రెండు సోలో హీరోగా సినిమాలు కాదు. ఒకటి శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కుబేర’ (Kubera). అందులో నాగ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంకోటి రజనీకాంత్‌ ‘కూలీ’ (Coolie). అందులోనూ గెస్ట్‌ పాత్రే. ఈ రెండు సినిమాలు రిజల్ట్‌ ఎలా ఉన్నా నాగ్‌ వచ్చేది ఏమీ ఉండదు.   సోలో హీరోగా వచ్చి, హిట్‌ పడితేనే అభిమానులు ఆనందిస్తారు. కెరీర్‌కీ స్పీడు వస్తుంది. కానీ నాగ్‌ ఎందుకో ఆ దిశగా ఆలోచించడం లేదు.  కొత్తగా ఒప్పుకొన్న సినిమాలూ లేవు. ఆయన ఈ మధ్య కొత్త కథలు వినడం లేదని సన్నిహితులు చెబుతున్నారు. కుబేర, కూలీ పూర్తయిన తర్వాత కొత్త కథలు వింటారా? లేదా ఇంకేదన్నా ప్లాన్‌లో (Akkineni Fans) ఉన్నారా? అన్నది తెలియాల్సి ఉంది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌లను చూసైనా నాగ్‌ స్పీడ్‌ అందుకోవాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

Updated Date - Feb 04 , 2025 | 03:37 PM