Akhil Akkineni: అఖిల్ పెళ్లి ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే
ABN , Publish Date - Jan 21 , 2025 | 10:05 AM
Akhil Akkineni: నాగార్జున అఖిల్ పెళ్లిని కూడా సాధారణంగా నిర్వహించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ పెళ్ళికి కూడా లిమిటెడ్ గెస్ట్‌లను ఆహ్వానించనున్నారు. ఇంతకీ పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరగనుందంటే..
అక్కినేని వారసుడు, నాగార్జున రెండో తనయుడు, యాక్టర్ అఖిల్ అక్కినేని పెళ్లి మూహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఆయన నిశ్చితార్థం గతేడాది నవంబర్‌లో ఢిల్లీకి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ జైనాబ్ రావడ్జీతో జరిగిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరి ప్రేమకు పెద్దలు అంగీకరించి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాగా, లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్లల పెళ్ళికి భాజాలు మోగిన విషయం తెలిసిందే. మరి అఖిల్ పెళ్లి ఎప్పుడు? ఎక్కడంటే..
నాగార్జున అఖిల్ పెళ్లిని కూడా సాధారణంగా నిర్వహించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ పెళ్ళికి కూడా లిమిటెడ్ గెస్ట్ లను ఆహ్వానించనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ లోనే అఖిల్ పెళ్లి నిర్వహించనున్నారు. మార్చి 24న పెళ్లి జరగనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న.. అక్కినేని ఫ్యామిలీ ఈ వార్తలను ఇంకా ధ్రువీకరించలేదు. వాస్తవానికి చివరి నిమిషం వరకు అక్కినేని ఫ్యామిలీ వెడ్డింగ్ వెన్యూ, డేట్ లను బయటపెట్టేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. మరోవైపు ఈ పెళ్ళికి పలువురు భారత క్రికెటర్లు కూడా హాజరు కానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే.. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, జూ. ఎన్టీఆర్ తదితర స్టార్ హీరోలు కుటుంబసభ్యులతో కలసి హాజరు కానున్నట్లు సమాచారం. బాలీవుడ్ నుండి అమీర్ ఖాన్ అమితాబ్ బచ్చన్ తదితరులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు అఖిల్.. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ వంటి హిట్టు సినిమా తీసిన మురళీ కిషోర్ చెప్పిన కథ నచ్చడంతో.. అఖిల్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యింది. ఈ సినిమా తిరుపతి బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనుందని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్‌కు అనుబంధంగా మనం ఎంటర్‌ప్రైజెస్ అనే బ్యానర్‌లో ఈ సినిమాను నాగార్జున, చైతన్యనిర్మిస్తున్నారు. ఈ సినిమాకి 'లెనిన్' అనే టైటిల్ ని పరీశీలిస్తున్నారు. సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటించనుంది.