Akhanda 2 Thandavam Heroine: ప్రగ్యా జైస్వాల్ ఏమైంది.. ఇదేం ట్విస్ట్ బోయపాటి?

ABN , Publish Date - Jan 24 , 2025 | 08:55 PM

‘అఖండ’ సీక్వెల్ ‘అఖండ 2: తాండవం’పై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలున్న విషయం తెలిసిందే. ఇటీవల థమన్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించారు. అలాంటి సినిమాలో హీరోయిన్ విషయంలో మేకర్స్ కన్ఫ్యూజ్ చేశారు. ఈ చిత్రం ఓపెనింగ్‌లో ప్రగ్యా జైస్వాల్ కనిపించగా.. ఇప్పుడు మరో హీరోయిన్‌ని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు.

Akhanda 2 Thandavam Movie

ప్రగ్యా జైస్వాల్.. ఈ మధ్య నందమూరి హీరోయిన్‌గా పేరు పొందిన ఈ బ్యూటీ.. బాలయ్య వరస చిత్రాలలో అవకాశం దక్కించుకుంటుంది. ‘అఖండ, డాకు మహారాజ్’ చిత్రాలలో హీరోయిన్‌గా నటించిన ప్రగ్యా జైస్వాల్.. బాలయ్య తదుపరి చిత్రం, ‘అఖండ’ సీక్వెల్ ‘అఖండ 2: తాండవం’లోనూ అవకాశం పొందినట్లుగా వార్తలు వచ్చాయి. వార్తలు రావడం ఏంటి? ఈ సినిమా పూజా కార్యక్రమాలలో కూడా ప్రగ్యా హల్‌చల్ చేసింది. ‘డాకు మహారాజ్’ ఇంటర్వ్యూలలో కూడా ‘అఖండ 2: తాండవం’ సినిమాలో మళ్లీ అవకాశం రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసింది. బోయపాటి కూడా తన వరుస చిత్రాలలో ఆమెకు అవకాశం ఇస్తూ వస్తున్నారు. అయితే ఏమైందో ఏమో గానీ.. ‘అఖండ 2: తాండవం’ సినిమాలో మెయిన్ హీరోయిన్ అంటూ శుక్రవారం మరో హీరోయిన్ పేరుతో పాటు ఫొటోని విడుదల చేశారు.


Also Read- Kumbh Mela Monalisa: మహా కుంభమేళా మోనాలిసాకు బంపరాఫర్..

ఆ హీరోయిన్ ఎవరో కాదు.. సంయుక్తా మీనన్. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న సంయుక్త.. ఇప్పుడు కొన్ని హై-ప్రొఫైల్ ప్రాజెక్టులలో నటిస్తోంది. అసలింత వరకు పేరు కూడా వినబడని ఈ ప్రాజెక్ట్‌లో సడెన్‌గా సంయుక్త పేరు వినబడటం, మేకర్స్ అధికారికంగా ప్రకటించడం చూస్తుంటే.. ప్రగ్యా జైస్వాల్ ఉన్నట్టా? లేనట్టా? అనేలా అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే, షూటింగ్ మొదలైన రోజు బాలయ్య, ప్రగ్యా జైస్వాల్‌ పాల్గొన్న షాట్‌కు బాలయ్య చిన్న కుమార్తె ఎం. తేజస్విని క్లాప్ కొట్టారు. ఇప్పుడేమో సంయుక్త మెయిన్ లీడ్ అంటున్నారు. మొత్తానికైతే హీరోయిన్ విషయంలో కన్ఫ్యూజ్ చేసేశారు. మరి ఈ కన్ఫ్యూజన్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేకపోలేదు.


Samyuktha.jpg

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను ఈ ‘అఖండ 2: తాండవం’ కోసం నాల్గవసారి కొలాబరేట్ అవుతుండగా.. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. సీక్వెల్‌ను భారీ బడ్జెట్‌తో బిగ్ కాన్వాస్‌పై నిర్మిస్తున్నారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను ఇద్దరికీ ఇదే మొదటి పాన్ ఇండియా చిత్రం. ఈ సినిమాను 25 సెప్టెంబర్, 2025న దసరా సందర్భంగా థియేటర్లలోకి తెచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


Also Read-IT Raids on Tollywood: ఐటీ నెక్స్ట్ టార్గెట్ అల్లు అరవిందేనా?

Also Read-Sachin Daughter Sara: నా సీక్రెట్స్‌ అన్నీ వాడికి తెలుసు.. వాడే నా ప్రాణం

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 24 , 2025 | 08:55 PM