Akhanda 2 Thandavam: ‘అఖండ 2: తాండవం’‌కి విలన్‌గా ‘సరైనోడు’ పడ్డాడులే..

ABN , Publish Date - Feb 08 , 2025 | 05:28 PM

నందమూరి నటసింహం బాలయ్య, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఈ సినిమాకు సంబంధించి వస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటి సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి. తాజాగా ఈ మూవీ విలన్ ఎవరో తెలుపుతూ.. అలాగే సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందో చెబుతూ.. మేకర్స్ ఓ అప్డేట్ వదిలారు.

Akhanda 2 Thandavam Team

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న హైలీ యాంటిసిపేటెడ్ చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఈ సినిమాతో వీరిద్దరూ నాల్గవసారి కొలాబరేట్ అయ్యారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన మునుపటి బ్లాక్ బస్టర్ చిత్రం ‘అఖండ’కు ఇది సీక్వెల్. ‘అఖండ’ను మించేలా ‘అఖండ 2: తాండవం’ యాక్షన్, ఇంటెన్స్ నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లేలా 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలయ్య బిడ్డ ఎం తేజస్విని నందమూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్‌ని మేకర్స్ వదిలారు.


Also Read- Sankranthiki Vasthunam OTT: ఓటీటీలోకి 'సంక్రాంతికి వస్తున్నాం' ఎక్కడ, ఎప్పుడంటే..

ఈ అప్డేట్‌లో మోస్ట్ ట్యాలెంటెడ్ యాక్టర్ ఆది పినిశెట్టి తన కెరీర్‌లో ఒక ఎక్సయిటింగ్ చాపర్ట్‌ని మార్క్ చేస్తూ, ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రను పోషించబోతున్నట్లుగా మేకర్స్ తెలిపారు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘సరైనోడు’ సినిమాలో ఆదిని ఇంటెన్స్ పాత్రలో చూపించిన దర్శకుడు.. ఈ సినిమాలో మరోసారి ఫెరోషియస్‌గా, తన కెరీర్‌లో మోస్ట్ ఇంపాక్ట్ పాత్రలలో ఒకటిగా రూపొందించారని తెలుస్తుంది. ఆది ఈ మూవీలో కొత్త లుక్‌‌లో కనిపించనున్నారని.. బాలకృష్ణ, ఆది మధ్య జరిగే పేస్ ఆఫ్ అభిమానులకు ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లింగ్ విజువల్ ఫీస్ట్ అందించబోతోందని మేకర్స్ చెబుతున్నారు.


Aadhi-Pinishetty.jpg

ప్రస్తుతం, ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్‌లో ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్ నిర్మించిన గ్రాండ్ సెట్‌లో జరుగుతోంది. ఈ సెట్స్‌లో ప్రస్తుతం బ్రెత్ టేకింగ్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సీక్వెన్స్‌ను రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ పర్యవేక్షిస్తున్నారు. బాలకృష్ణతో పాటు ఆది పినిశెట్టి ఈ యాక్షన్-ప్యాక్డ్ షూట్‌లో పాల్గొంటున్నారని సమాచారం. వారి పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను తమ సీట్ల ఎడ్జ్‌లో ఉంచుతాయని, అంత బలంగా బోయపాటి ఈ సన్నివేశాలను రాశారని, సినిమాలోని మెయిన్ హైలైట్లలో ఈ సన్నివేశం ఒకటిగా నిలబడిపోతుందని యూనిట్ చెబుతుంది. సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీత సంచలనం థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 25 సెప్టెంబర్, 2025న దసరా స్పెషల్‌గా చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు.


Also Read- Oka Pathakam Prakaaram Review: 'ఒక పథకం ప్రకారం' పూరీ తమ్ముడికి హిట్‌ ఇచ్చిందా..

Also Read- Thandel Review: నాగ చైతన్య తండేల్ మూవీ రివ్యూ 

Also Read- Samantha: మాజీ భర్త మళ్లీ పెళ్లిపై సమంత షాకింగ్ కామెంట్స్..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 08 , 2025 | 05:28 PM