Akhanda 2: ఫస్ట్‌ లుక్‌ ప్లాన్‌ చేశారు.. ఎప్పుడంటే..

ABN , Publish Date - Feb 08 , 2025 | 07:59 AM

బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ‘అఖండ’కు సీక్వెల్‌గా వస్తున్న చిత్రమిది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రమిది. ఎం.తేజస్విని నందమూరి సమర్పణలో 14రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు

Nandamuri Balakrishna

సంక్రాంతి బరిలో 'డాకు మహారాజ్‌’గా (Daku Maharaj) ప్రేక్షకుల్ని అలరించారు నందమూరి బాలకృష్ణ(NBK). ఆ సక్సెస్‌ వెంటనే ఆయనకు పద్మభూషణ్‌ పురస్కారం దర్కింది. ప్రస్తుతం ఆయన ఆ జోష్‌లో ఉన్నారు. అదే 'అఖండ-2: తాండవం’ (Akhanda-2) చిత్రం షూటింగ్‌ను శరవేగంగా నడిస్తున్నారు. బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ‘అఖండ’కు సీక్వెల్‌గా వస్తున్న చిత్రమిది. బోయపాటి శ్రీను (boyapati Srinu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రమిది. ఎం.తేజస్విని నందమూరి సమర్పణలో 14రీల్స్‌ ప్లస్‌ (14reels plus) పతాకంపై రామ్‌ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు.



ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇటీవల బోయపాటి బృందం కుంభమేళలో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమా నుంచి బాలకృష్ణ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల చివరిలో మహా శివరాత్రి సందర్బంగా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.  ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరణ చేసుకుంటోంది. బాలకృష్ణ ఇందులో రెండు భిన్నమైన పాత్రలో కనువిందు చేయనున్నారు. సంయుక్తా మీనన్‌ ప్రగ్యా జైస్వాల్‌ కథానాయికలు. దసరా సందర్భంగా సెప్టెంబరు 25న ఈ చిత్రం విడుదల కానుంది.  (Akhanda2: Thandavam)



తాజాగా కేంద్ర ప్రభుత్వం బాలయ్యకు పద్మభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఆయన స్పందిస్తూ.. ‘‘పద్మభూషణ్‌ పురస్కారం నాకు.. మా కుటుంబానికే కాదు, తెలుగు పరిశ్రమకు వచ్చిన గౌరవం’’ అని అన్నారు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు. శుక్రవారం ఇండస్ట్రీలోని పది అసోసియేషన్స్‌,  యూనియన్స్‌ కలిసి బాలయ్యకు శాలువా కప్పి  ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపాయి. వారంతా కలిసి బాలకృష్ణ కోసం త్వరలోనే తెలుగు చిత్ర పరిశ్రమ తరపున ఓ సన్మాన వేడుక నిర్వహించనున్నట్లు.. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Feb 08 , 2025 | 08:00 AM