Aadi Saikumar: షణ్ముఖ చిత్రంలో ఎ.ఐ. సాంగ్
ABN , Publish Date - Mar 18 , 2025 | 01:03 PM
ఆదిసాయికుమార్ తాజా చిత్రం 'షణ్ముఖ'. సప్పాని షణ్ముగం దర్శకత్వంలో సప్పాని బ్రదర్స్ నిర్మించి ఈ సినిమా మార్చి 21న విడుదల కాబోతోంది. ఇందులోని ఎ.ఐ. సాంగ్ స్పెషల్ అట్రక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు.
గత కొంతకాలంగా ఆది సాయికుమార్ (Aadi Saikumar) కు సరైన సక్సెస్ దక్కడం లేదు. దాంతో ఆశలన్నీ ఈ నెల 21న రాబోతున్న 'షణ్ముఖ' (Shanmukha) మూవీ పైనే పెట్టుకున్నాడు. ప్రముఖ కన్నడ నిర్మాతలు సప్పాని బ్రదర్స్ (Sappani Brothers) నిర్మించిన ఈ సినిమాను వారిలో ఒకరైన షణ్ముగం సప్పాని డైరెక్ట్ చేశారు. అంతేకాదు... ఇందులో ఓ కీలక పాత్రను సైతం పోషించాడు. ఇప్పటి వరకూ హీరోగా నటిస్తూ, పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషించిన ఆదిత్య ఓం (Aditya Om) 'షణ్ముఖ' చిత్రంలో ప్రతినాయకుడు కమల్ పాత్రను పోషించాడు. హీరోయిన్ అవికా గోర్ (Avika Gor) ఇందులో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా నటించింది. మర్డర్ మిస్టరీ డ్రామాకు డివోషనల్ టచ్ ఇచ్చినట్టు దర్శకుడు షణ్ముగం చెబుతున్నారు.
గత కొంతకాలంగా ఎ.ఐ.ను సినిమా రంగం కూడా బాగానే ఉపయోగించుకుంటోంది. ముఖ్యంగా ఎ.ఐ. ద్వారా పాటలను రూపొందించడమే కాదు... వాటి చిత్రీకరణకు అవసరమైన విజువల్స్ ను కూడా దాని నుండి సినిమా వాళ్ళు పొందుతున్నారు. అలా డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ 'షణ్ముఖ'లోనూ ఎ.ఐ. సాయంతో ఓ డివోషనల్ సాంగ్ ను క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది. కేజీఎఫ్ (KGF), సలార్ (Salaar) చిత్రాలకు సంగీతం సమకూర్చిన రవి బసూర్ (Ravi Basrur) ఈ పాటకు ఇచ్చిన ట్యూన్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని అంటున్నారు. మరి ఆది సాయికుమార్, అవికా గోర్ లను 'షణ్ముఖ' చిత్రం గట్టెక్కిస్తుందేమో చూడాలి.
Also Read: Malayali Writer: ట్రిపుల్ ఆర్ రైటర్ మృతి... రాజమౌళి సంతాపం
Also Read: Megastar: చిరంజీవికి ముద్దులతో స్వాగతం!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి